5నిమిషాల్లో 100 కోట్లు ఉఫ్!
2008లో మొత్తం 246 ట్రేడింగ్ సెషన్లు జరిగాయి. 2009లో ఇంతవరకు 39 రోజులలో ట్రేడింగ్ సెషన్లు జరిగాయి. ప్రతి రోజు ఐదు గంటల 35 నిమిషాల సేపు (ఉదయం 9.55 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు) సాగే ట్రేడింగ్ సెషన్ ను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంవత్సరం ఇంతవరకు లావాదేవీలు జరిగిన ప్రతి నిమిషంలో సగటున రూ. 20 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. అయితే, ఈ సగటు 2008 సంవత్సరంలోని ప్రతి నిమిషం లావాదేవీలలో సంభవించిన రూ. 50 కోట్ల కన్నా రెండింతలకు పైగా ఉంది.
సెన్సెక్స్ కదలిక పరంగా బెంచ్ మార్క్ సూచి 2009లో తొలి రెండు నెలలలో 750 పాయింట్లకు పైగా నష్టపోయింది. 2008 మొత్తంలో సెన్సెక్స్ పది వేల పాయింట్లకు పైగా పతనమైంది. అయితే, ధర-ఆర్జన నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుంటే భారతీయ మార్కెట్ 2009 తొలి రెండు మాసాలలో కొంత ఎక్కువ ఖరీదైనదిగా మారినట్లు కనిపిస్తున్నది. ఇదే కొలబద్దతో చూస్తే 2008లో సగంపైగా చౌకగా ఇది మారింది. ప్రస్తుతం సెన్సెక్స్ ధర-ఆర్జన దామాషా 12.82గా ఉన్నది. ఈ ఏడాది ప్రారంభంలోని స్థాయి 12.16 కన్నా ఇది అధికం. అయితే, అంతకుముందు సంవత్సరాంతపు స్థాయి 26.94 నుంచి ఇది 2008లో బాగా పడిపోయింది.
Pages: -1- 2 News Posted: 1 March, 2009
|