'హస్తం' అందుకున్న మమత
2006లో మిత్రా 4260 వోట్ల తేడాతో సిపిఎం అభ్యర్థి రతిన్ సర్కార్ చేతిలో ఓడిపోయారు. ఈసారి మిత్రాకు దాని కన్నా ఏడింతలుపైగా ఆధిక్యం లభించింది.ఈసారి మిత్రాకు 58 శాతం వోట్లు పోలయ్యాయి. 2006లో కాంగ్రెస్, తృణమూల్ రెండింటికీ కలిపి పోలైన వోట్ల కన్నా ఇది 6 సాతం అధికం. కాంగ్రెస్ తో కుదుర్చుకున్న అవగాహన ఫలితంగా కన్నా తృణమూల్ విజయంగానే ఈ ఫలితాన్ని పరిగణిస్తున్నారు. ఎందుకంటే బిష్ణుపూర్ (వెస్ట్) నియోజకవర్గం ఉన్న 24 పరగణాల జిల్లా మొత్తం బెంగాల్ లోనే మమతకు పెట్టని కోట వంటిది. 'తన అభ్యర్థిని ఉపసంహరించుకున్నందుకు కాంగ్రెస్ కు మేము కృతజ్ఞులం. అయితే, మా విజయాన్ని చిన్నది చేసి చూడకండి. మరొక పార్టీ నుంచి మా పార్టీకి బదలీ అయిన వోట్ల పరంగా ఈ భారీ ఆధిక్యం గురించి వివరించజాలం' అని మమత పేర్కొన్నారు.
అయితే, లోక్ సభ ఎన్నికల కోసం మమత, కాంగ్రెస్ మధ్య ఎన్నికల సర్దుబాట్ల కోసం కృషి చేస్తున్నవారి నైతిక స్థైర్యాన్ని ఈ విజయం పెంచింది. అదే సమయంలో లెఫ్ట్ ను ఇది మరింతగా కుంగదీస్తున్నది. లోక్ సభ ఎన్నికలకు ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లుగా ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత చేసిన ప్రకటన సిపిఎం వ్యథను మరింత పెంచింది. ఎందుకంటే ప్రతిపక్షాల మధ్య సీట్ల ఒప్పందం కుదిరిన పక్షంలో లెఫ్ట్ ఫ్రంట్ సీట్లు తగ్గిపోగలవని సిపిఎం వృద్ధ యోధుడు జ్యోతి బసు శుక్రవారం ఒక ప్రకటనలో అంగీకరించారు.
Pages: -1- -2- 3 News Posted: 1 March, 2009
|