చెదరిన యుఎస్ డిగ్రీ కల
అమెరికా విశ్వవిద్యాలయాల్లోని ప్రొఫెసర్లు విద్యార్ధులతో చనువుగా ఉండే వైనాన్ని, అదే సమయంలో చదివే విషయంలో కఠినంగా ఉండే వైనాన్ని ఆమె విద్యార్ధులకు వివరించారు. అమెరికా విద్యాలయాల సంస్కృతిని ఆమె విద్యార్ధులకు చక్కని ఇంగ్లీషులో పరిచయం చేశారు. అండర్ వేర్లను శుభ్రం చేసుకునేందుకు కూడా తీరికలేని విధంగా షెడ్యూల్ ఉండబోతోందని ఆమె చమత్కరించారు. ఎంత హృద్యంగా అమెరికా చదువులపై వివరించినప్పటికీ ఆ విద్యార్ధుల్లో పలు సందేహాలు, అపోహలు చోటు చేసుకొన్నాయి. పలు ప్రశ్నలతో ఆ విద్యార్ధులు ఆమెను ముంచెత్తారు.
యుఎస్ సి స్కాలర్ షిప్ లను అందిస్తుందా? ఫీజు భరించగలమా? జాబ్ మార్కెట్ పై మాంద్యం ప్రభావం ఎలా ఉంది? లాంటి పలు ప్రశ్నలకు ఆమె ఓపికగా సమాధానం చెప్పారు. చాలా మంది విద్యార్ధులు బ్యాంక లోన్ విషయంపై ఆందోళన చెందుతున్నారు. ఆ కాలేజి నుండి దాదాపు 12 మంది యుఎస్ సి ఇంజినీరింగ్ మాస్టర్ డిగ్రీ కోసం అప్లికేషన్లు పంపారు. అయితే వారందరు సందిగ్ధంలో ఉన్నారు. ఏడాదికి దాదాపు 53 వేల డాలర్లు ఖర్చవుతాయి. చదువు పూర్తయిన వెంటనే జాబ్ రాకపోతే పెట్టిన ఖర్చంతా వృధా అవుతుందని కొందరు ఆలోచిస్తున్నారు.
Pages: -1- 2 -3- News Posted: 2 March, 2009
|