చెదరిన యుఎస్ డిగ్రీ కల
ఆ కాలేజి నుండి అమెరికా చదువుల కోసం అప్లై చేసినప్పటికీ పలు రకా అనుమానాలు వారిన వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలోని మాంద్యంతో ఉద్యోగాలు రాకపోవడం పెద్ద దెబ్బ. ఈ విద్యార్ధుల కంటే ముందుగా పై చదువుల కోసం అమెరికాకు వెళ్లిన సీనియర్లు అక్కడ ఉద్యోగాలు లేకపోవడంతో ఇంటి ముఖం పట్టారు. అందువల్ల అమెరికా చదువులపై విద్యార్ధుల కలలు పీడకలలుగా మారాయి. చిన్న చితకా ఉద్యోగాలు చేరిన వారు అమెరికా పై చదువుల అవకాశం వచ్చినప్పటికీ జాబ్స్ ను వదలిపెట్టేందుకు ఇష్టపడటం లేదు. అమెరికాలో చదువుకునే అనిశ్చితి కంటే భారత్ లో చిన్న ఉద్యగం చేసుకోవడమే మేలన్న భావన పలువురిలో బలంగా నాటుకుంది.
అయితే ఆ ఇంజినీరింగ్ కాలేజి విద్యార్ధిని అనుపమ కలల్ని, విశ్వాసాన్ని మాంద్యం ఏమీ చేయలేక పోయింది. ఆమె రోబోటిక్స్, ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ లో అమెరికాలో పరిశోధన చేయాలనుకుంటోంది.ఈ రంగంపై మాంద్యం ప్రతికూల ప్రబావం తన విశ్వాసాన్ని బలహీనపరచలేదని ఆమె భావిస్తోంది. అంత మాత్రాన ఆమె మాంద్యం ప్రభావాన్ని తక్కువగా చూడటం లేదు. కార్నెగ్ మిల్లన్ విశ్వవిద్యాలయంలో ఈ అకడమిక సంవత్సరంలో వచ్చిన సీటును ఒక ఏడాదికి వాయిదా వేయాలని ఆమె విశ్వవిద్యాలయ అధికారులను కోరింది. ఈ ఏడాది తమ కాలేజీలోనే పరిశోధన చేయాలని ఆమె నిర్ణయించుకుంది. నిరుడు కంటే ఈ ఏడాది యు ఎస్ సి అడ్మిషన్ కొరకు అప్లికేషన్స్ పెద్ద సంఖ్యలోనే వచ్చాయి. అయితే వారిలో ఎంత మంది నిజంగా కోర్సుల్లో చేరుతారన్న విషయం ఇప్పటికింగా సందిగ్ధంగానే ఉందని యుఎస్ సి కోఆర్డినేటర్ కుమార్ తెలిపారు.
Pages: -1- -2- 3 News Posted: 2 March, 2009
|