దశ తిప్పేది దక్షిణాదే!
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికార పీఠమైన రైజినా హిల్ కు మార్గం ఉత్తర ప్రదేశ్ మీదుగా సాగుతుందని ఒకప్పుడు చెప్పుకునేవారు. ఎందుకంటే లోక్ సభలో ఆ రాష్ట్రానికి 80 మంది ఎంపిలు ప్రాతినిధ్యం వహిస్తుంటారు. కాని 1996 నుంచి రెండు దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో ప్రధాన శక్తులుగా రూపు దాల్చాయి. ఇవి భారతదేశపు 'ఊయల' రాష్ట్రాలు. రాజకీయ లోలకం ఏదో ఒక పార్టీకి లేదా ఫ్రంట్ కు అనుకూలంగా నిర్ణయాత్మకంగా కదులుతుంటుంది కనుక వీటికి ఆ పేరు వచ్చింది. ఈ రెండు రాష్ట్రాలు, పొరుగున ఉన్న పుదుచ్చేరి కలిపి పార్లమెంట్ లో 82 స్థానాలు కలిగి ఉన్నాయి. దీనితో ఇవి కేవలం సంఖ్యాబలంతో యుపిని వెనుకకు నెట్టాయి.
ఈ పర్యాయం కూడా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలోని విజేతలే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించవచ్చునని అనుకుంటున్నారు. అందువల్ల కేంద్రంలో తదుపరి ప్రభుత్వం రూపురేఖల నిర్ణయంలో తెలుగు దేశం పార్టీ (టిడిపి ) అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఎఐఎడిఎంకె అధినేత్రి జె. జయలలిత కీలక పాత్ర పోషించవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకత అంశం ఆధారంగా వారిద్దరూ సీట్ల పరంగా ఎక్కువ లబ్ధి పొందవచ్చు.
ఈ కింది గణాంకాలను ఒకసారి పరికించండి. 2004 ఎన్నికలలో యుపిఎ తాను గెలుచుకున్న 221 సీట్లలో 71 సీట్లు ఈ రెండు రాష్ట్రాలలోనే ఉన్నాయి. వీటికి అదనంగా వామపక్షాల పరంగా ఆరు సీట్లు కలిసాయి. ఈ రాష్ట్రాలలో యుపిఎ భాగస్వామ్య పక్షాలతో కలసి వామపక్షాలు పోటీ చేయడం వల్ల లభించినవే ఈ ఆరు సీట్లు.
Pages: 1 -2- -3- News Posted: 4 March, 2009
|