దశ తిప్పేది దక్షిణాదే!
అధికారంలో ఉన్న కారణంగా కాంగ్రెస్ వెనుకడుగు వేసి రక్షణాత్మక వ్యూహాన్ని అనుసరిస్తున్నది. ఆంధ్రలో ఆ పార్టీ రెండు అంశాలను ఆధారం చేసుకున్నది. వాటిలో ఒకటి - డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో చేపట్టిన పెక్కు అభివృద్ధి పథకాల కారణంగా అది కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించింది. రెండవది - సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి కొత్తగా ఏర్పాటు చేసిన ప్రజా రాజ్యం పార్టీ (పిఆర్ పి) టిడిపి వైపు వెళ్ళే ప్రభుత్వ వ్యతిరేక వోట్లు కొన్నిటిని కైవసం చేసుకోవచ్చు.
అయితే, కాంగ్రెస్ కు అనూహ్య పరిణామం ఏమిటంటే సరిగ్గా ఎన్నికలకు ముందు సత్యం కుంభకోణం బట్టబయలు కావడం. ఈ కుంభకోణం టిడిపి, టిఆర్ఎస్, వామపక్షాలకు అధికార కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉధృత స్థాయిలో ప్రచారం ప్రారంభించేందుకు ఉమ్మడి ఆయుధాన్ని సమకూర్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అంశంపై ఈ కాంగ్రెసె వ్యతిరేక ఫ్రంట్ లోని పరస్పర వైరుధ్యాలను కూడా దీని ముందు కొరగాకుండా పోయాయి. ఇక తమిళనాడులో జయలలిత తన వైపు తిప్పుకోవడావికి రకరకాలుగా ప్రయత్నిస్తున్న తమ మిత్ర పక్షం పిఎంకెను అట్టిపెట్టుకోవడానికి కాంగ్రెస్, డిఎంకె నానా తంటాలు పడుతున్నాయి.
Pages: -1- -2- 3 News Posted: 4 March, 2009
|