దశ తిప్పేది దక్షిణాదే!
ఐదు సంవత్సరాల తరువాత తిరిగి సమీకరణాలు మారాయి. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ ఒంటరిదైపోయింది. 2004 నాటి మిత్రపక్షాలు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్), వామపక్షాలు చంద్రబాబు నాయుడుతో చేతులు కలపాలని నిర్ణయించుకున్నాయి. ఇక తమిళనాడులో వామపక్షాలు, ఎండిఎంకె తమ పంథా మార్చుకుని ఎఐఎడిఎంకెతో చెలిమి చేస్తున్నాయి. అవి మూడవ యుపిఎ మిత్రపక్షం పిఎంకెను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. లోలకం అటువైపే తిరిగితే యుపిఎ ఈ రాష్ట్రాలలోని తన 71 సీట్లలో అధిక భాగాన్ని కోల్పోవచ్చు.
అందువల్ల ఆంధ్ర ప్రదేశ్, తమిళవాడు కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలో ప్రభుత్వం తిరిగి ఏర్పాటు కావడానికి కీలకం కాగలవు. ఇక తృతీయ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుపై వామపక్షాలు పెట్టుకన్న ఆశలు ఈ రెండు రాష్ట్రాలలో కొత్త మిత్ర పక్షాలు ఎఐఎడిఎంకె, టిడిపి-టిఆర్ఎస్ గెలుచుకునే సీట్లపై ఆధారపడి ఉంటాయి.
Pages: -1- 2 -3- News Posted: 4 March, 2009
|