దేశీ జాబ్స్ వైపు ఐఐఎమ్
బెంగళూరు: ఐఐఎమ్ సంస్థలు దేశవాళీ వాసనలతో గుభాళిస్తున్నాయి. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎమ్) సంస్థల్లో ఎనమిదంకెల డాలర్ జీతాలు, ఎమ్ఎన్ సి ఉద్యోగాల కాలం ముగిసింది. నియామకాల ఆఖరి సీజను ముగుస్తున్నప్పటికీ ఐఐఎమ్ ల్లో విదేశీ సంస్థల హడావుడి లేనేలేదు. దేశీయ కంపెనీలు ఐఐఎమ్ ల హాట్ ఫేవరేట్లుగా నిలిచాయి. ప్రపంచ మహా సంక్షోభంతో ముఖ్యంగా అమెరికన్ కంపెనీలు ఫెడరల్ రిజర్వ్ దగ్గర బిచ్చమెత్తే పరిస్థితికి దిగజారాయి. ప్రపంచ ఆర్ధిక మాంద్యంతో ఎమ్ఎన్ సిల కార్యకలాపాలు, పరిమాణాలు కుదించుకుపోయాయి. కార్పొరేట్ సంస్థలన్నీ లేఆఫ్ ల మంత్రం జపిస్తుండడంతో నియామకాల జోరు తగ్గింది. క్యాంపస్ నియామకాలకు దాదాపు తెరపడింది.
ప్రపంచ సగటు ఆర్ధికాభివృద్ది ఆర్ధిక సంక్షోభ ప్రమాణం 3శాతం కంటే దిగువకు చేరుకోగా, భారత ఆర్దికాభివృద్ధి 7 శాతంగా ఉంటుందని నిపుణుల అంచనా. భారత్ లో ఆర్ధికాభివృద్ధి మందగిస్తుందే గాని, సంక్షోభ స్థాయికి పడిపోదని వారి అంచనా వెల్లడించింది. దాంతో భారత కార్పొరేట్ రంగంలో ఉపాధి అవకాశాలు పూర్తిగా అడుగంట లేదు. ఈ నేపథ్యంలో దేశీయ కార్పొరేట్ సంస్థలు నియమాకాల కోసం ఐఐఎమ్ ల వెంటపడ్డాయి. గతంలో అంతర్జాతీయ అవకాశాలు మెరుగ్గా ఉన్నప్పుడు దేశీయ సంస్థలు అందుకోలేని ఐఐఎమ్ గ్రాడ్యుయేట్లు ప్రస్తుతం చౌకగా దొరుకుతున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు దాదాపు అడుగంటిన పరిస్థితుల్లో దేశీయ కంపెనీలు ఐఐఎమ్ లకు ఆసరాగా నిలిచాయి. ధాంతో ఐఐఎమ్ ల్లో దేశవాళీ కార్పొరేట్ సంస్థల హడావుడి ఎక్కువైంది.
Pages: 1 -2- -3- News Posted: 5 March, 2009
|