దేశీ జాబ్స్ వైపు ఐఐఎమ్
హెచ్ 1బి వీసా పై అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో కొంతమంది విద్యార్ధులు అంతర్జాతీయ నియామకాలను తిరస్కరించారు. కొంత మంది వారికి కేటాయించిన ప్రదేశాలు నచ్చక నియామకాల్ని తిరస్కరించారు. అదీ కాకుండా బ్యాంకింగ్, కన్సల్టింగ్ రంగాల్లో అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. దాంతో వాటి పట్ల అవిశ్వాసం కారణంగా పలువురు విద్యార్ధులు తిరస్కరించారు. గత ఏడాది దాదాపు 70 అంతర్జాతీయ అవకాశాలు వచ్చాయి. అయితే ఐఐఎమ్ లన్నిటిలో విదేశీ అవకాశాలను పూర్తిగా తిరస్కరించారని అర్ధం కాదు. ఐఐఎమ్ బెంగళూరులో ఒక్క విదేశీ అవకాశం మాత్రమే తిరస్కరణకు గురైంది. ఐఐఎమ్-లక్నోలో విదేశీ అవకాశాల్ని ఎవరూ వదలుకోలేదు. ఉద్యోగం చేయవలసిన ప్రాంతం నచ్చక ఐఐఎమ్-బిలో విదేశీ నియమకాన్ని తిరస్కరించారు.
అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల పట్ల నెలకొన్న ఉదాసీనత విదేశీ కంపేనీల నియామకాల పట్ల ఐఐఎమ్ విద్యార్ధుల్లో విముఖతను పెంచాయని పలువురు విద్యార్ధులు భావిస్తున్నారు. అంతా కుప్పకూలలేదు. 'పెద్ద విదేశీ ఎమ్ఎన్ సిలు ప్రపంచవ్యాప్త కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాటిలో ఉపాధి అవకాశాలు బాగా ఉన్నాయి. సురక్షితంగా ఉన్నాయి'అని ఒక ఐఐఎమ్ ఫ్యాకల్టీ తెలిపారు. ఆసక్తికరంగా, అమెరికాలోని ప్రవాస భారతీయులు 79 శాతం మంది స్వదేశానికి తిరిగి వెళుతున్నారని అంతర్జాతీయ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసంది. ఈ ప్రచారం కూడా ఐఐఎమ్ అభ్యర్ధులపై తీవ్ర ప్రతికూల ప్రభావం వేసింది.
Pages: -1- -2- 3 News Posted: 5 March, 2009
|