దేశీ జాబ్స్ వైపు ఐఐఎమ్
వాల్ స్ట్రీట్ కుప్పకూలడం, గ్లోబల్ ఇన్వెస్టమెంట్ బ్యాంకులు చతికిల బడ్డంతో ఐఐఎమ్ ల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ ఆర్ధిక మాంద్యంతో అభివృద్ధి చెందిన దేశాలన్ని దాదాపుగా రక్షణ చర్యలను చేపట్టాయి. అంతర్జాతీయ ఉద్యోగ నియామకాల్లో అనిశ్చితి ఏర్పడింది. దాంతో భారతీయ కార్పొరేట్ నియమాలే అత్యంత సురక్షితమైనవిగా నిలిచాయి. లండన్, న్యూయార్క్ పోస్టింగ్ లతో పాటు ఎనిమిదంకెల జీతాలు గత ఏడాది చర్చనీయాంశంగా ఉండేవి. ఈనాడు అందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితి ఐఐఎమ్ ల్లో నెలకొంది. కొంత మంది విద్యార్ధులు లాభదాయకమైన విదేశీ కంపెనీల అవకాశాలను కాలదన్ని స్వదేశీ కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఐఐఎమ్ కోజి కోడ్ లో దదాపు ఏడుగురు విద్యార్ధులు అంతర్జాతీయ కంపెనీల అవకాశాలను తిరస్కరించి దేశీయ సంస్థల్లో చేరారు.
Pages: -1- 2 -3- News Posted: 5 March, 2009
|