చిరు గుర్తుకు `అరచేయి' అడ్డు?
అయినా ఒకే గుర్తు దక్కకపోతే ప్రజారాజ్యం పార్టీకి వచ్చే కష్టనష్టాలు ఎక్కువగానే ఉంటాయి. ప్రజలలో ఉన్న ఇమేజ్ దృష్ట్యా చిరంజీవి బొమ్మే ఎన్నికల్లో గెలిపించే గుర్తని ధీమా ఉన్నప్పటికి ప్రజారాజ్యం ప్రత్యర్ధుల జిత్తులమారి ఎత్తుగడలకు బలవ్వక తప్పదు. ఒకే ఎన్నికల గుర్తు లేకుండా నియోజకవర్గానకో గుర్తుతో ప్రజారాజ్యం అభ్యర్ధులు రంగలోకి దిగవలసి వస్తే వైరి పక్షాలు పాతవే అయినా చాలా దుర్మార్గమైన ప్రణాళికను చట్టబద్దంగా అమలు చేస్తాయి. అందులో ప్రధానమైంది తిరుగుబాటు అభ్యర్ధుల బెడద. ప్రజారాజ్యం టిక్కెట్ ఆశించి, భంగపడిన వారిని ఎరపెట్టి గాలం వేసి ఎన్నికల బరిలో నిలచేటట్టు చేస్తాయి. వారు తామే అసలైన అభ్యర్దులమనే ప్రచారంతో చిరంజీవి బొమ్మతో తిరుగుతారు. ఒక్కో నియోజక వర్గంలో ఇలాంటి వారిని కనీసం ఇద్దరిని ప్రోత్సహిస్తారు. అంతకాలం పార్టీలో తిరిగిన వీరిలో ఎవరు అసలో, ఎవరు నకిలీయో తెలియక అయోమయం సృష్టించడం ద్వారా వోట్లను చీల్చడం ప్రధానంగా ఈ ఎత్తుగడను అనుసరిస్తారు. అంతేకాకుండా ఇలాంటి నకిలీ అభ్యర్ధి తరఫున పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుగా వ్యవహరించేవారు వారిని నిలబెట్టిన అసలు పార్టీకి పని చేస్తారు. అలాంటి పరిస్థితులు ప్రజారాజ్యం లాంటి కొత్త పార్టీలకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి.
అలాగని అందరూ చెబుతున్నట్టు గుర్తుకోసం మరో పార్టీ సహకారాన్ని తీసుకుంటే ప్రజారాజ్యం కష్టాలు తీరకపోగా కోత్త సమస్యలను కొని తెచ్చుకున్నట్టవుతుందని న్యాయనిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రజారాజ్యం గుర్తు కోసం చివరి నిముషం వరకూ పోరాడుతుందని, రాని పక్షంలో కష్టమో, నష్టమో స్వంతంగానే పోటీకి దిగుతుందని వ్యూహకర్తలు చెబుతున్నారు. కాంగ్రెస్ ఎంత అడ్డుకున్నా ఎన్నికల గుర్తు రావడం ఖాయమని, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎవ్వరి తరం కాదనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
Pages: -1- -2- 3 News Posted: 6 March, 2009
|