దావూద్ గుప్పెట్లో పైరసీ రాకెట్
దావూద్ ఇబ్రహీం భారత దేశ మాఫియా పితామహులకే పితామహుడుగా ఎదిగాడు. అతను బ్యాంకాక్ నుండి దుబాయ్ వరకు క్రిమినల్ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. మారణాయుధాల రక్షణతో గ్యాంగులను నడుపుతున్నాడు. మత్తుమందుల రవాణా, బెదరించి డబ్బు గుంజుకోవడం, కిరాయి హత్యలు వగైరా నేరాలన్నిటిని తన గ్యాంగ్ ల ద్వారా దావూద్ నిర్వహిస్తున్నాడు. దావూద్ ఇబ్రహీమ్ గ్యాంగ్ సిండికేట్ ని సాధారణంగా డి-కంపెనీ అని పిలుస్తుంటారు. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులు దావూద్ ప్రధాన నిందితుడు. భారత దేశం ఒత్తిడితో దావూద్ ను 'గ్లోబల్ టెర్రరిస్టు' గా అమెరికా ట్రెజరీ డిపార్ట్ మెంట్ గుర్తించింది. దావూద్ తన స్మగ్లింగ్ నెట్ వర్క్ ను అల్ ఖాయిదా, పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలకు అరువిస్తుంటాడు.
ఫిల్మ్ పైరసీ కారణంగా భారత సినీ పరిశ్రమ 2,050 కోట్ల రూపాయలను అంటే 400 మిలియన్ డాలర్లను నష్టపోతున్నట్లు ఒక అంచనా తెలియజేసింది. ర్యాండ్ చేస్తున్న అధ్యయనానికి మోషన్ పిక్చర్ అసోషియేషన్ (ఎమ్ పిఏ) నిధులను సమకూర్చింది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పైరసీ యంత్రాంగాలను ఈ అధ్యయనం విడివిడిగా అధ్యయనం చేసి బయటపెట్టింది. పైరసీ వ్యాపారం ద్వారా నిధులను సేకరిస్తున్న ప్రపంచ వ్యాప్త టెర్రరిస్టు గ్రూపుల గురించి ర్యాండ్ సంస్థ విస్తృతంగా పరిశోధన చేసింది.
Pages: -1- 2 -3- -4- News Posted: 6 March, 2009
|