దావూద్ గుప్పెట్లో పైరసీ రాకెట్
భారత దేశంలో సినీ పైరసీ వ్యాపారంపై దావూద్ కంపెనీ పూర్తి ఆధిపత్యాన్ని చేజిక్కించుకుంది. బాలీవుడ్, హాలీవుడ్ పైరసీ మాస్టర్ డీవిడీ లను తన చేతిలో ఉంచుకుని ఒక పెద్ద రాకెట్ ను నడిపిస్తోంది. మత్తు మందుల వ్యాపారంలో వచ్చే లాభాల కంటే డివిడి పైరసీ వ్యాపారంలో వస్తున్న లాభాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ప్రభుత్వం నుండి వస్తున్న ప్రమాదం, ఇబ్బందులు కూడా చాలా తక్కువగా ఉంటుందని ఆ నివేదిక తెలిపింది. దాంతో ప్రపంచ వ్యాప్త క్రిమినల గ్యాంగ్ లో సాంప్రదాయక కార్యక్రమాల్లో పైరసీ డివిడి వ్యాపారం కూడా చేరింది.
సినీ పైరసీ వ్యాపారం చేసి నిధులను సమకూర్చుకున్నట్లు కొన్ని తీవ్రవాద సంస్థల డాక్యుమెంట్లలో బయటపడింది. సాంప్రదాయ క్రిమినల్ సిండికేట్ గా ప్రయాణాన్ని ప్రారంభించిన డి-కంపెనీ డబ్బు కోసం నేరాల చేస్తున్న స్థితి నుండి రాజకీయ ఎజెండాతో పనిచేస్తున్న తీవ్రవాద సంస్థలకు నిధులను సమకూర్చే స్థాయికి చేరింది. డి-కంపెనీ చేస్తున్న నేరాల నుండి వస్తున్న ఆదాయంలో కొంత భాగాన్ని టెర్రరిస్టు సంస్థలకు అందిస్తోందని ఆ నివేదిక తెలిపింది. ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ ఫిల్మ్ పైరసీ వ్యాపారం నుండి నిధులను సమకూర్చుకున్నట్లుగా డి-కంపెనీ కూడా ఫిల్మ్ పైరసీ వ్యాపారాన్ని చేపట్టింది. ఆ ఆదాయంలో కొంత భాగాన్ని టెర్రర్ సంస్థలకు అందజేస్తున్నట్లు ఆ నివేదిక తెలిపింది. ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ ఒక తీవ్రవాద సంస్థగా ప్రారంభమై ఒక క్రిమినల్ గ్యాంగ్ గా అవతరించింది. డి-కంపెనీ ప్రయాణం అందుకు భిన్నంగా సాగింది.
Pages: -1- -2- 3 -4- News Posted: 6 March, 2009
|