దావూద్ గుప్పెట్లో పైరసీ రాకెట్
బాలీవుడ్ సినీ పరిశ్రమలోని ప్రతి విభాగంపై తన ఆధిపత్యాన్ని నెల కొల్పడంలో డి-కంపెనీ విజయవంతమైంది. ఈ పైరసీ డివిడి వ్యాపారం ద్వారా డి-కంపెనీ సంపాదించిన సొమ్మ వివరాలను ఆ నివేదిక తెలుపలేదు. అయితే పైరసీ డివిడి వ్యాపారం అత్యంత లాభదాయకంగా అవతరించింది. డి-కంపెనీకి బాలీవుడ్ లో ఉన్న పలుకుబడితో ఏ సినిమానైనా చిటికెలో పైరసీ చేయగలదు. అల్ మన్సూర్, సదాఫ్ బ్రాండ్లతో మార్కెట్లో విడుదలవుతున్న డివిడిలకు మార్కెట్ లో అత్యంత శక్తివంతమైనవి. ఈ బ్రాండ్లు యావత్ దక్షిణాసియా ప్రాంతంపై ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది.
కెపిఎమ్ జి కి చెందిన రాజేష్ జైన్ భారత మీడియా నివేదికను తయారు చేసిన బృందానికి సార్ధ్యం వహించారు. డెజిటలైజేషన్ ప్రక్రియతో పైరసీకి మంచి అనుకూలత లభించిందని జైన్ తెలిపారు. అదే సమయంలో పైరసీకి, నివేదిక వెల్లడించినట్లు టెర్రరిజానికి మధ్య సంబంధంపై ఆయన వ్యాఖ్యానించలేదు. ర్యాండ్ నివేదికను కొంత మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎమ్ పిఏ నిధులతో రూపొందిన ఈ నివేదిక పలు మలుపులతో చదివేందుకు చాలా కష్టంగా తయారైంది. చదివేందుకు కష్టమైనప్పటికీ ఆ నివేదిక పలు చీకటి కోణాల్ని వెలికితీసింది.
Pages: -1- -2- -3- 4 News Posted: 6 March, 2009
|