యష్ చోప్రాకు అమీర్ నో!
ఇండియాలోని ప్రతిభావంతుడైన నటులలో ఒకరైన అమీర్ ఖాన్, దిగ్గర్శకుడు యష్ చోప్రా కలిసి పనిచేయడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. అమీర్ ఖాన్, ప్రీతి జింటా హీరోహీరోయిన్లుగా ఓ చిత్రాన్ని తీయాలనే ఆలోచనలో చోప్రా కొద్దికాలంగా ఉన్నారు. ప్రీతి ఇప్పటికే ఆ ఆఫర్ ఒప్పుకుని సంతకాలు కూడా చేసింది. యష్ రాజ్ ఫిలిమ్స్ తో అమీర్ సంప్రదింపులు సాగిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం యష్ చోప్రా సినిమా చేయడానికి అమీర్ నిరాకరించగా, ప్రీతి జింటా విషయంలో ఎలాంటి మార్పు లేదు. అమీర్ ప్లేస్ లో సల్మాన్ ఖాన్ పేరు ప్రస్తుతం పరిశీలనలో ఉంది.
'దిల్ చాహ్తా హై' సినిమాలో అమీర్, ప్రీతి జింటా జంట యష్ చోప్రాకు ఎంతో బాగా నచ్చిందనీ, మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా తీయాలనే ఆలోచనలో ఆయన ఉన్నప్పటికీ అమీర్ నిరాకరించడంతో అది కార్యరూపంలోకి వచ్చేలా లేదనీ యష్ రాజ్ ఫిలిమ్స్ వర్గాలు తెలిపాయి. యష్, అమీర్ ల మధ్య పలు దఫాల చర్చలు జరిగినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని వారు తెలిపారు. 'యష్ గత చిత్రాల విషయంలో జరిగినట్టుగానే ఈ సినిమా కథ విషయంలోనూ యష్, అమీర్ లు సుదీర్ఘ చర్చలు జరిపారు. యష్ తరహా రొమాంటిక్ ఫిల్మ్ ఇది. ఇద్దరు అపరిచిత వ్యక్తులు కలుసుకుని తమ ప్రేమను వృద్దాప్యం వచ్చినా ఒకిరితో మరొకరు పంచుకుంటారు. వారిద్దరి జీవిత పయనమే ఈ చిత్రం. అమీర్ సైతం ప్రీతిని కలుసుకుని యష్ ఆఫర్ గురించి చర్చించారు. అయినప్పటికీ స్క్రిప్టు విషయంలో అమీర్ కన్విన్స్ కాకపోవడంతో ఆ అవకాశాన్ని తోసిపుచ్చారు. ఆయన స్థానంలో సల్మాన్ పేరు బలంగా వినిపిస్తోంది' అని ఆ వర్గాలు వెల్లడించాయి.
Pages: 1 -2- News Posted: 6 March, 2009
|