యష్ చోప్రాకు అమీర్ నో!
ఒకింత వెనక్కి వెళితే...షారూక్ కు మంచి పేరు తెచ్చిన 'డర్' సినిమా గురించి ముచ్చటించుకోవాలి. నిజానికి షారూక్ కంటే ముందు అమీర్ పేరు పరిశీలనలోకి వచ్చింది. అందులో ఇతర పాత్రల్లో సన్నీడియోల్, జూహీచావ్లా అప్పటికే ఎంపికయ్యారు. సన్నీకీ, తనకూ కలిసి ఒకేసారి స్టోరీ డిస్కషెన్స్ జరపాలని అమీర్ పట్టుబట్టారు. అయితే యష్ అందుకు నిరాకరించారు. ఆ తర్వాత క్రమంలో అమీర్ కు మాట మాత్రమైనా చెప్పకుండా షారూక్ ఎంపిక జరిగింది. దాంతో అమీర్ మనసు గాయపడింది. ఎప్పటికీ యష్ చోప్రా సినిమాల్లో నటించేది లేదంటూ ఆయన నిర్ణయం తీసుకున్నారు.
యష్ చోప్రా తాజా చిత్రంలో అమీర్ కు బదులుగా సల్మాన్ ను ఎంపిక చేసే విషయంలో నిజానిజాలేమిటి? యష్ చోప్రాకూ, షారూక్ ఖాన్ కూ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్టు వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో సల్మాన్ ను ఎంపిక చేసినట్టయితే ఆ విభేదాలు స్పష్టమేనన్న సంకేతాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన స్పష్టత కోసం మరికొంత కాలం వేచిచూడాల్సి రావచ్చు.
Pages: -1- 2 News Posted: 6 March, 2009
|