బాబు అందరికీ అలుసే!
మొత్తం సీట్లలో సిపిఐకి, సిపిఎంకు, తెరాసకు, ఎమ్మార్పీయస్ కు కేటాయించగా ఇక తెలుగుదేశం పార్టీకి మిగిలేవి అన్నది ప్రధానమైన ప్రశ్నగా తయారైంది. ఈ మిత్రపక్షాలు అలవాటు ప్రకారం భవిష్యత్తులో మద్దతును ఉపసంహరించుకున్నా తెలుగుదేశం ప్రభుత్వానికి ఢోకా లేకుండా చంద్రబాబు జాగ్రత్త పడకపోతే ఇన్ని రాజీలు పడి ప్రయోజనం ఏమిటన్నది సీనియర్ నాయకులు వ్యక్తం చేస్తున్న సందేహం. ఒకవేళ అధికారంలోకి వస్తే ఫక్తు తెలుగుదేశం సభ్యులు సభలో కనీసం మెజారిటీగా ఉండాలని, అంటే 2004లో కాంగ్రెస్ పార్టీలా లేకపోతే ఈ మిత్రపక్షాలు కొంపముంచడం ఖాయమని వాదిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఏసంఖ్యలో వామపక్షాలకు, తెరాసకు సీట్లు ఇచ్చిందో ఇప్పుడు తెలుగుదేశం అదే ఫార్మలాను అమలు చేయాలని వారు పోరుపెడుతున్నారు. కాని మహాకూటమిలోని మిత్రులను కట్టడిచేయడం లేదా వారు తన మాట వినేటట్టు చేసుకునే అవకాశం ఇప్పుడు చంద్రబాబు చేతిలో లేదని, బెట్టుచేసిన ఈ పక్షాలను బతిమాలి తెచ్చుకున్న చంద్రబాబుకు వారు చెప్పినట్టు తలాడించడం మినహా గత్యంతరం లేదని సీనియర్లు వాపోతున్నారు.
తమకు కేటాయించవలసిన నియోజకవర్గాలకు సంబంధించి మిత్రపక్షాలు చేంతాడు జాబితాలను చంద్రబాబు ముందు పెడుతున్నాయి. వామ పక్షాలు అడుగుతున్నవాటినే తెరాస కూడా కోరడంతో సమస్య తెగడం లేదు. ఈ మూడు పక్షాలు చంద్రబాబును మూడు పక్కలకూ లాగుతూ మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంటే మళ్ళీ కొత్తగా ఎమ్మార్పీయస్ తయారైంది. వీటికి తోడు తెలుగుదేశం తరపున ప్రచారంలోకి దిగి బావ చంద్రబాబును గద్దెనెక్కించడానికి కంకణం కట్టుకున్న నందమూరి బాలకృష్ణ జాబితా మరోకటి ఉంది. తన అనుచరులకు, అభిమానులకు టిక్కెట్లు ఇస్తానని ఆయన హామీలు ఇచ్చి ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సీట్ల కోరికలూ వార్తల్లోకి వచ్చాయి. ఈ నేపధ్యంలోనే కేసిఆర్ ఆదివారం రాత్రి సుమారు రెండు గంటలపాటు చంద్రబాబుతో ఏకాంతంగా ముఖాముఖీ చర్చలు జరిపారు. సీట్ల సంగతి రెండురోజుల్లో తేల్చమని అల్టిమేటం ఇచ్చి కేసిఆర్ అసంతృప్తిగానే తిగిగిపోయారు. మహా కూటమిలో చేరినట్లు ప్రకటించి ముప్పై సీట్లు అడుగుతున్న మంద కృష్ణ మాదిగకు ఇష్టమైతే ఒక పార్లమెంట్ సీటు ఇస్తామని చంద్రబాబు స్పష్టంగా చెప్పారని తెలిసింది.
Pages: -1- -2- 3 News Posted: 9 March, 2009
|