థర్డ్ ఫ్రంట్ దూసుకొస్తోంది!
న్యూఢిల్లీ: మృతశిశువుగా చాలా మంది కొట్టిపారేసిన ప్రకాశ్ కారత్ మానసపుత్రిక (తృతీయ ఫ్రంట్) అకస్మాత్తుగా ప్రాణం పోసుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీనితో అతి వృద్ధ పార్టీ మహా వృద్ధుల పార్టీ మీద నుంచి దృష్టి తప్పించి ఇటువైపు తేరిపార చూడవలసిన పరిస్థితి తలెత్తింది. ఒరిస్సాలో బిజెడి, బిజెపి మధ్య చీలిక వచ్చి, వామపక్షాలు, నవీన్ పట్నాయక్ మధ్య మైత్రి చిహ్నాలు గోచరిస్తుండడంతో ఎన్ డిఎ కన్నా ఈ అస్పష్టమైన తృతీయ ఫ్రంట్ నుంచి ఎదురయ్యే భారీ సవాల్ గురించి పార్టీలోనే వ్యక్తమవుతున్న అభిప్రాయాలను కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకోనారంభించింది.
ఎన్నికల అనంతరం తాను అనుసరించబోయే వ్యూహం గురించి నవీన్ గుట్టుగానే వ్యవహరిస్తున్నారు. కాని ఎన్నికలకు ముదు సిపిఎంతో ఆయన పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం కనిపిస్తుండడంతో కారత్ మానసపుత్రిక తృతీయ ఫ్రంట్ కు గురువారం కర్నాటకలో శ్రీకారం చుట్టడానికి ముందే వామపక్షాల నైతిక స్థైర్యం పెరిగింది.
'నేను నా సహచరుల వద్ద 'ఈ ఫ్రంట్ ను తేలికగా చూడకండి. ఎందుకంటే మనం చాలా రాష్ట్రాలలో దీనితోనే పోరు సాగించవలసి ఉంటుంది' అని గత రెండు మూడు నెలలుగా మొత్తుకుంటూనే ఉన్నాను. వారిలో చాలా మంది ఎన్నికల పోరు అధ్యక్ష తరహా ఎన్నికలలో వలె అద్వానీ, మన్మోహన్ సింగ్ మధ్యే ఉంటుందనే నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. నవీన్ పట్నాయక్ ఎన్ డిఎ గూటిలో నుంచి బయటకు వచ్చి వామపక్షాల పంచన చేరినప్పుడు వారు దిగ్భ్రాంతి చెందారు. 'ఇటువంటి ప్రకంపనాల మార్పులకు మనం సిద్ధమవుదాం' అని ఇప్పుడు వారంటున్నారు' అని దక్షిణాది రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఒకరు చెప్పారు.
Pages: 1 -2- -3- News Posted: 10 March, 2009
|