థర్డ్ ఫ్రంట్ దూసుకొస్తోంది!
ఇక వామపక్షాలు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)తో కలసి కాంగ్రెస్ 2004లో తెలంగాణ ప్రాంతాన్ని దున్నేసిన ఆంధ్ర ప్రదేశ్ లో ఆ పార్టీకి పరిస్థితి పూర్తిగా చుక్కెదురైంది. కాంగ్రెస్ ఇప్పుడు తెలుగు దేశం - లెఫ్ట్ - టిఆర్ఎస్ ఉమ్మడి ప్రతిపక్షాన్ని ఎదుర్కొనవలసి వస్తున్నది. ఈ స్థితిలోనూ కాంగ్రెస్ కు ఒకే ఒక అంశం ఊరట కలిగిస్తున్నది. వెనుకబడిన తరగతుల (బిసిల) వోట్లు తెలుగు దేశం పార్టీ, మెగాస్టార్ చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం పార్టీ (పిఆర్ పి) మధ్య చీలిపోయే అవకాశం ఉండడం కాంగ్రెస్ కు ఉపశమనం కలిగిస్తున్నది. కాగా, బిజెపితో కాంగ్రెస్ ముఖాముఖి తలపడుతున్న పెద్ద రాష్ట్రాలు తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. అవి మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, గుజరాత్.
Pages: -1- -2- 3 News Posted: 10 March, 2009
|