మందతో 'మహా' ఇరకాటం!
హైదరాబాద్: మందకృష్ణ మాదిగతో మహాకూటమి ఇరకాటంలో పడినట్లే కనిపిస్తోంది. మహాకూటమిలో చేరుతున్నట్లు మందకృష్ణ మాదిగ ఏకపక్షంగా చేసిన ప్రకటన మహా కూటమిని సంకటంలో పడేసింది. మహాకూటమి నాయకులతో చర్చలు జరపకుండా, సీట్లపై ఒక అవగాహన ఏర్పడకుండానే మంద కృష్ణ తాము మహాకూటమి తరఫున ఎన్నికల బరిలోకి దిగబోతున్నామని, 30 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలకు పోటీ చేయాలనుకుంటున్నట్లు మీడియా ముందు ప్రకటించడంతో కూటమి నాయకులలో తర్జన భర్జన మొదలైంది. మంద కృష్ణ ప్రకటననపై కూటమి నాయకులు కొంత అసహనానికి గురవుతున్నట్లు కనిపిస్తోంది. దీనిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మంద కృష్ణ తనకు తోచినట్లుగా నిర్ణయం తీసుకోవడంపై చంద్రబాబు ఆందోళనలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే మందకృష్ణ బాబుతొ భేటీ అయ్యారు. దాంతో అప్పుడే తాను మహాకూటమిటో చేరుతున్నట్లు ప్రకటించుకోవడమే కాకుండా, 30 అసెంబ్లీ, 4పార్లమెంట్ స్థానాలలో పోటీ చేయనున్నట్టు జాబితా కూడా విడుదల చేయడం చంద్రబాబును మరింత కలవర పాటుకు గురి చేస్తోంది. మందకృష్ణ ఏ ఉద్దేశంతో ఈ ప్రకటనలు చేస్తున్నారో అర్థ కావడం లేదని కూటమి నేతలు తర్జన భర్జన పడుతున్నారు.
Pages: 1 -2- -3- News Posted: 12 March, 2009
|