మందతో 'మహా' ఇరకాటం!
ఎస్సీల వర్గీకరణకు టీడీపీ కట్టుబడి ఉన్నప్పటికీ మాలలను ఎట్టి పరిస్థితుల లో కూడా దూరం చేసుకునే అవకాశా లు ఏమాత్రం కనిపించడం లేదు. ఒక వర్గాన్ని చేరదీయడానికి మరో వర్గాన్ని ఎందుకు దూరం చేసుకోవాలనే ఆలోచ… నతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీలో మాలలకు పెద్దపీట వేసామని, వారు పార్టీలో కీలక బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారని, టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లోక్‌సభ స్పీకర్‌గా చేసిన బాలయోగి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా చేసిన ప్రతిభా భారతి కూడా మాల కులానికి చెందిన వారు. మరి ఇలాంటి సీనియర్ నాయకులలో మాలలు ఉన్నప్పుడు మంద కృష్ణ విధిస్తున్న షరతులకు టీడీపీ ఏ విధంగా కట్టుబడి ఉంటుంది? మాలలను ఎందుకు చేర్చుకోవద్దు అనే ప్రశ్నలు టీడీపీ నాయకుల నుంచి ఎదురవుతున్నాయి. కాబట్టి మంద కృష్ణ మాదిగ ప్రకటనపై పునరాలోచించా ల్సిన అవసరం ఉందని సీనియర్లు భావిస్తున్నారు. కేసీఆర్ కూడా ఈయన నిర్ణయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన కోరుకునే సీట్లు తెలం గాణ ప్రాంతలోనే ఎక్కువ సంఖ్యలో అడుగుతున్నారు. దీని వల్ల టీడీపీకి నష్టం కొంత భాగం అయినప్పటికీ భారీ సంఖ్యలో నష్ట పోవాల్సినది టిఆర్‌ఎస్ పార్టీయే అని సీనియర్ నాయకులు భావిస్తున్నారు.
తెలుగుదేశంలో చేరుతున్న కారెం శివాజీ
మాలలను కూడా కలుపుకుని పోవాలనే వ్యూహంలో భాగంగా చంద్రబాబు ఆ వర్గాన్ని టీడీపీలోకి ఆహ్వానిస్తు న్నారు. మహాకూటమిలో చేరాలని ఆయన కోరుతున్నారు. ఇందులో భాగంగానే మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీని కూడా టీడీపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. ఆయన వస్తానంటే కలుపుకొని పోవడానికి తమ కూటమికి ఎలాంటి అభ్యంతరం లేదని టీడీపీ స్పష్టం చేస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వర్ల రామ య్యను కలిసి చర్చించినట్లు తెలిసింది. కారెం శివాజిని టీడీపీలోకి ఆహ్వానిస్తున్న మాట వాస్తవమే అని వర్ల రామయ్య అన్నారు. అయితే కారెం మాత్రం రామయ్య నాకు మంచి మిత్రుడని, అందుకే ఆయనను కలిశా నన్నారు. ఏ పార్టీలో చేరేదీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, త్వరలోనే తన నిర్ణయాన్ని తెలియపరుస్తానని `సూర్య'తో అన్నారు. కారెం శివాజికి టీడీపీలో చేరాలని ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు దృష్టికి మాత్రం ఈ విషయం ఇంకా చేరలేదు. ఉభయ వామపక్ష పార్టీలతో సీట్ల సర్దుబాటు పూర్తయిన తర్వాత కారెం శివాజీ చంద్రబాబు ను కలిసి తన నిర్ణయం తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్వసనీయంగా తెలిసింది.
Pages: -1- -2- 3 News Posted: 12 March, 2009
|