మందతో 'మహా' ఇరకాటం!
మాలలు దూరమైపోతారన్న దిగులు
మందకృష్ణను మహాకూటమిలో చేర్చుకున్న ట్లయితే, వారికి 10 నుంచి 15 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఇద్దామనుకున్న ప్పటికీ తద్వారా మాలల ఆగ్రహానికి గురై వారిని దూరం చేసుకోవాల్సి వస్తుందని, ఇప్పుడున్న పరిస్థితులలో అది సాధ్యం కాదని చంద్రబాబుతో సహా ఆ పార్టీ సీనియర్ నాయకులు అభిప్రా య పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల మేరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, లేదంటే తెలగుదేశం పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని నాయకులు హెచ్చరిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీకే కాకుండా మొత్తం కూటమి మిత్రపక్షాలపై దాని ప్రభావం పడుతుందని, తద్వారా కాంగ్రెస్ లాభపడుతుందనేది బాబు ఆలోచనగా తెలుస్తోంది.
మహాకూటమిలో ఎమ్మార్పీఎస్‌ను చేర్చుకుని, సీట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే కూటమిలోని అన్ని పార్టీలు తమ వాటా సీట్లలో కొన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. అయితే అందుకు ఎవరూ సుముఖత వ్యక్తం చేయడం లేదు. సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటికే చంద్రబాబు తో వామపక్ష పార్టీలు అనేక సార్లు చర్చలు జరిపినప్పటికీ వారి సీట్లు నేటీకీ ఖరారు కాలేదు. ఇంతలోనే మంద కృష్ణ మహాకూటమిలో చేరుతున్నట్లు, 30 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయబోతున్నట్లు చేస్తున్న ప్రకటనలు మహాకూటమి నాయకులకు రుచించడం లేదు. అంతే కాదు మాలలు దూరంగా ఉంచితేనే మహాకూటమిలో చేరుతాం అని మంద కృష్ణ అంక్షలు పెడుతుండడం కూడా చంద్రబాబుకు మింగుడు పడడం లేదు.
Pages: -1- 2 -3- News Posted: 12 March, 2009
|