థర్డ్ ఫ్రంట్ నిలబడేనా?
న్యూఢిల్లీ: ఒరిస్సాలో వామపక్షాలు, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం)లతో చేతులు కలిపేందుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) బిజెపి సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డిఎ)లో నుంచి బిజూ జనతా దళ్ (బిజెడి) బయటకు వచ్చిందని ఆదివారం వార్త వచ్చినప్పుడు సిపిఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ ఆనందం పట్టలేకపోయారు. 'ప్రస్తుత పరిస్థితులలో తృతీయ శక్తికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని మేము ఎప్పుడూ చెబుతున్నాం' అని ఆయన గొప్పగా చెప్పుకున్నారు. తమతో కలిసే అవకాశం లేదనుకున్న పార్టీలు అంతకంతకు తమకు భాగస్వాములవుతుంటే వారి సరసన చేరబోతున్న నవీన్ పట్నాయక్ కు ఆయన రెండు చేతులూ బారచాచి మరీ స్వాగతం పలికారు.
కరత్ పార్టీ సరసన చేరిని పార్టీలలో తమిళనాడులో జయలలిత నాయకత్వంలోని ఎఐఎడిఎంకె, ఆంధ్ర ప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ (టిడిపి), కె. చంద్రశేఖరరావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్), కర్నాటకలో హెచ్.డి. దేవెగౌడ నేతృత్వంలోని జనతా దళ్ (ఎస్) ఉన్నాయి. నిరాకార, అస్థిరమైన తృతీయ ఫ్రంట్ రెండు ప్రధాన పార్టీలు, రాజకీయ పండితుల పాలిట ఒక పెద్ద జంతువు వంటిది. ఎన్నికల ముందు దాని ప్రభావం చాప కింద నీరు వంటిది. కాంగ్రెస్, బిజెపి అవకాశాలను హరించడానికి ఎన్నికల తరువాత అది దాదాపు రాత్రికి రాత్రే ఒక అయస్కాంతంగా మారిపోతుంది.
Pages: 1 -2- -3- News Posted: 12 March, 2009
|