థర్డ్ ఫ్రంట్ నిలబడేనా?
అయినప్పటికీ, ఏ తృతీయ ఫ్రంట్ ప్రభుత్వానికైనా కాంగ్రెస్ లేదా బిజెపి మద్దతు అవసరం అవుతుంది. తమ మధ్య అంతర్గతంగాఉన్న స్పర్థలు, వైరుధ్యాల కారణంగా ప్రాంతీయ పార్టీలు ఒకే గ్రూపుగా కలసి సాగలేవు. రెండు జాతీయ పార్టీలు ఎన్నికల అనంతర పరిస్థితిని పూర్తిగా మార్చివేయవచ్చు.
చివరగా అంతా అంకెలే ప్రాధాన్యం వహిస్తాయి. అందుకే ఎన్నికల ముందు తృతీయ ఫ్రంట్ అవకాశాల గురించి జోస్యం చెప్పడానికి పండితులు వెనుకాడుతున్నారు. ఒక విషయం మాత్రం స్పష్టం. ప్రాంతీయ పార్టీలు పైకి ఎదుగుతున్నాయి. రాజకీయ రంగస్థలంలో జాతీయ పార్టీల స్థానం కుంచించుకుపోతున్నది. కాంగ్రెస్, బిజెపి రెండింటిపై మరిన్ని సీట్ల కోసం కాబోయే మిత్ర పక్షాలు ఒత్తిడి తీసుకువస్తున్నాయి. చివరకు ఆ రెండూ ఇదివరకెన్నడూ లేనంత తక్కువ సంఖ్యలో స్థానాలకు పోటీ చేయవలసి రావచ్చు. మరి తృతీయ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రాంతీయ పార్టీల ఆశలు అంతకంతకు పెరుగుతుండడంలో ఆశ్చర్యం లేదు కదా!
Pages: -1- -2- 3 News Posted: 12 March, 2009
|