కుంగిన బిలియనీర్లు
20 మంది అత్యున్నత సంపన్నుల్లో భారతీయ సంతతికి చెందినవారు ఇద్దరు మాత్రమే ఉన్నారు. గత ఏడాది దాదాపు 25.7 బిలియన్ డాలర్లు నష్టపోయినప్పటికీ 19.3 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ ఈ జాబితాలో ఉన్నారు. న్యూయార్క్ మెజర్ మైకేల్ బ్లూంబెర్గ్ 20 మంది జాబితాలో 17 వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో 64 శాతం బిలియనీర్ల సగటు వయసు 63.7 ఏళ్లుగా ఉంది.
గత ఏడాదిలో రష్యా, చైనా బిలియనీర్ల సగటు వయసు 46-48 ఏళ్ల మధ్య ఉండేది. వయసు విషయంలో బిల్ గేట్స 53 ఏళ్ల యువకునిగా పేర్కొనాలి. ఈ ఏడాది అత్యంత యువకుడైన బిలియనీర్ గా జర్మనీకి చెందిన అల్బర్ట్ వాన్ థుర్న్ ఉండ్ టాక్సిస్ ని ప్రకటించారు. ఆయన 25 ఏల్ల వయసులో 2.1 బిలియన్ డాలర్ల ఆస్తిపరునిగా నిలిచారు. గత ఏడాది విజేతల్లో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బెర్గ్ నిలిచారు. ఈ ఏడాది ఆయన ఈ జాబితాలో చేరలేదు.
అమెరికా కాలిఫోర్నియా, న్యూయార్క్, టెక్సాస్ నగరాల్లో ఎక్కువ మంది బిలియనీర్లు కేంద్రీకృతమయ్యారు. ఈ బిలియనీర్లలో 54 ఏళ్ల జాక్విన్ గుజమన్ లోయరా సంపాదించిన ఆస్తులు కొకైన్ అక్రమ రవాణా నుండి సంపాదించడం జరిగింది. ఈ బిలియనీర్ ఎంపిక వివాదాస్పదమైంది.
ఫోర్బ్స్ 20 బిలియనీర్ల జాబితాలోని వారి వివరాలు:::
1. బిల్ గేట్స్, ఆస్తుల విలువ 40 బిలియన్ డాలర్లు, వ్యాపారం-మైక్రోసాప్ట్, అమెరికా.
2. వారెన్ బఫెట్, 37 బిలయన్ డాలర్లు, వ్యాపారం-బెర్కషైర్ హాథ్ వే, అమెరికా.
3. కార్లోస్ స్లిమ్ ఆయన కుటుంబం, 35 బిలియన్ డాలర్లు, టెలికామ్ రంగం, మెక్సికో.
4. లారెన్స్ ఎలిసన్ 22,5 బిలియన్ డాలర్లు, వ్యాపారం-ఒరాకిల్, అమెరికా.
5. ఇంగ్వార్ కంప్రాడ్, ఆయన కుటుంబం, 22 బిలియన్ డాలర్లు, ఐకియా, స్వీడన్.
6. కార్ల ఆల్ బ్రెక్ట్, 21.5 బిలియన్ డాలర్లు, ఆల్ది, జర్మనీ.
7. ముఖేష్ అంబానీ, 19.5 బిలియన్ డాలర్లు, పెట్రోకెమికల్స్, భారత దేశం.
8.లక్ష్మి మిట్టల్, 19.3 బిలియన్ డాలర్లు, ఉక్కు దిగ్గజం, భారత దేశం.
9. థియో ఆల్ బ్రెక్ట్, 18.8 బిలియన్ డాలర్లు, ఆల్ది, ట్రేడర్ జోస్, జర్మనీ.
10. అమాన్షియో ఒర్టెగో, 18.3 బిలియన్ డాలర్లు, జరా, స్పెయిన్.
11. జిమ్ వాల్టన్, 17.8 బిలియన్ డాలర్లు, వాల్ మార్ట్, అమెరికా.
12. అలీస్ వాల్టన్, 17.6 బిలియన్ డాలర్లు, వాల్ మార్ట్ అమెరికాయ
13. క్రిస్టీ వాల్టన్ ఆయన కుటుంబం, 17.6 బిలియన్ డాలర్లు, వాల్ మార్ట్ అమెరికా.
14. ఎస్ రాబ్సన్ వాల్టన్, 16.5 బిలియన్ డాలర్లు, వాల్ మార్ట్ అమెరికా.
15. బెర్నార్డ్ ఆర్నాల్ట్, 16.5 బిలియన్ డాలర్లు,ఎల్ విఎమ్ హెచ్, ఫ్రాన్స్.
16. లి కా-షింగ్, 16.2 బిలియన్ డాలర్లు, డైవర్సిఫైడ్, హాంగ్ కాంగ్.
17. మైకేల్ బ్లూంబెర్గ్, 16 బిలియన్ డాలర్లు, బ్లూంబెర్గ్, అమెరికా
18. స్టీఫెన్ పీర్సన్, 14.5 బిలియన్ డాలర్లు, హెన్నెస్ అండ్ మోరిట్జ్, స్వీడన్.
19. చార్లెస్ కోష్, 14 బిలియన్ డాలర్లు, మాన్యుపాక్చరింగ్, ఎనర్జీ, అమెరికా.
20. డేవిడ్ కోష్, 14 బిలియన్ డాలర్లు, మాన్యుఫాక్చరింగ్, ఎనర్జీ, అమెరికా.
Pages: -1- 2 News Posted: 12 March, 2009
|