'రాజ్యం'లో 'దేశం' కోవర్టులు?
అయితే ప్రజారాజ్యం పార్టీలో తెలుగుదేశం తరఫున కోవర్టుల చొరబాట్ల గురించి చిరంజీవి బాహాటంగా ప్రస్తావించడం ఇదే మొదటిసారి. ఆయన తన సన్నిహిత సహచరులతో ఈ విషయాలు చర్చిస్తున్నారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. 'చిరంజీవి పార్టీని ప్రారంభించిన వెంటనే తన ఆఫీసులో నుంచి సమాచారాన్ని రహస్యంగా సేకరిస్తున్నారని, ఫోన్లను టాప్ చేస్తున్నారని, తన అనుచరుల కదలికలపై నిఘా వేస్తున్నారని ఆయన గ్రహించారు' అని పార్టీలో ఉన్నత స్థాయి వర్గాలు తెలియజేశాయి.
ముఖ్యమైన రాజకీయ నిర్ణయాలు తీసుకున్న మరుక్షణం ఆ విషయం బయటకు పొక్కుతున్నదని గ్రహించినప్పుడు ఆయన తన కుటుంబ సభ్యులతో ఒక సన్నిహిత వర్గం ఏర్పాటు చేసుకున్నారని కూడా ఆ వర్గాలు తెలిపాయి. 'ఆయనకు ఏమి చేయాలో తెలియలేదు. కొత్త కనుక ఇతరులకు దూరంగా ఉండిపోయారు' అని పార్టీ ప్రతినిధి ఒకరు చెప్పారు. రాష్ట్ర ఇంటలిజెన్స్ విభాగం అధికారులతో పాటు, కాంగ్రెస్ పై కూడా ఆయనకు ఈ విషయమై అనుమానాలు ఉన్నాయని తెలుస్తున్నది. చిరంజీవి అభిప్రాయంతో రాజకీయ విశ్లేషకులు కూడా కొంత వరకు ఏకీభవిస్తున్నారు. 'ఆయన అనుమానాలు నిర్హేతుకం కాదని నా భావన. ఆయన పార్టీలోకి చొరబాట్లు జరిగినట్లు కనిపిస్తున్నది' అని మరొక రాజకీయ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు.
ఇటీవల టిడిపిలో చేరిన వాసంశెట్టి సత్య, కేశినేని నాని పేర్లను ప్రస్తావించకుండా చిరంజీవి మాట్లాడుతూ, కొందరు నాయకులు టిడిపి 'తొత్తుల'ని, ప్రజారాజ్యంలో వాతావారణాన్ని కలుషితం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. సంపన్నులకే టిక్కెట్లు కేటాయిస్తున్నారనే ఆరోపణను చిరంజీవి ఖండించారు. ఆయన దీనిని తనపైన, తన పార్టీపైన ప్రారంభించిన దుష్ప్రచారంగా అభివర్ణించారు. 'మా జాబితాలో పలువురు కొత్తవారితో కలసి కొత్తగా కనిపిస్తుంది. మేము గరిష్ఠ సంఖ్యలో వెనుకబడిన తరగతుల (బిసి) అభ్యర్థులను నిలబెట్టగలం' అని ఆయన చెప్పారు. పిఆర్ పి నాలుగైదు రోజులలో మొదటి జాబితాను విడుదల చేయగలదని ఆయన ప్రకటించారు.
Pages: -1- 2 -3- News Posted: 12 March, 2009
|