'రాజ్యం'లో 'దేశం' కోవర్టులు?
అయితే, మహిళలకు ఎక్కువగా సీట్లు కేటాయించడంపైన, కాపు నాయకులకు సీట్లు తగ్గించడం లేదా పెంచడంపైన, బహిరంగ సభలలో తన అభిమానులను నియంత్రించడంపైన తన వైఖరి ఏమిటో చెప్పేందుకు చిరంజీవి నిరాకరించారు. తాను తిరుపతి నుంచి ఏప్రిల్ 23న జరిగే ఎన్నికలలో పోటీ చేయగలనని చిరంజీవి విస్పష్టంగా చెప్పారు. 'తిరుపతి నిర్థారితమైంది. అయితే, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి పోటీ చేయాలా అనేది నేను ఇంకా నిర్ణయించుకోలేదు' అని ఆయన తెలిపారు. తాను కచ్చితంగా మరొక నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయగలనని ఆయన చెప్పారు.
పిఆర్ పి అధికారంలోకి వచ్చిన పక్షంలో మద్య నిషేధాన్ని దశల వారీగా ప్రవేశపెట్టగలమని, బెల్ట్ షాపులను వెంటనే మూసివేయించగలమని చిరంజీవి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ జల యజ్ఞం గురించి ఆయన ప్రస్తావిస్తూ, పిఆర్ పి అన్ని ప్రాజెక్టులనూ ఒకేసారి చేపట్టబోదని చెప్పారు. కాగా జాతీయ స్థాయిలో బిజెపికి తన పార్టీ మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని చిరంజీవి పునరుద్ఘాటించారు. తన పార్టీకి ఉమ్మడి గుర్తు లభించగలదనే ఆశాభావాన్ని చిరంజీవి వ్యక్తం చేశారు.
Pages: -1- -2- 3 News Posted: 12 March, 2009
|