కేరళలో పుట్టిన 'హస్తం'?
భారతీయ జనతా పార్టీ (బిజెపి) గుర్తు కమలం. దీనిపై ఏకంగా ఒక గ్రంధమే ముద్రితం అయింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు వి.కె. మల్హోత్రా రాసిన 'లోటస్, ది ఎటర్నల్ కల్చరల్ సింబల్' అనే గ్రంథం కమలం గుర్తు ఆవిర్భావం గురించి క్షుణ్ణంగా వివరిస్తుంది. ఈ గ్రంధంలో భారతదేశం, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, సాహిత్యం గురించిన సమాచారం ఉంది. '1952 నుంచి జన సంఘ్ గా ఉన్నప్పుడు మాకు దీపం గుర్తుగా ఉండేది. జన సంఘ్ ను జనతా పార్టీ (జెపి)లో విలీనం చేసినప్పుడు భుజంపై నాగలి ఉన్న రైతు గుర్తు జనతా పార్టీకి ఉండేది.
తరువాత 1980లో బిజెపిని ప్రత్యేక రాజకీయ పార్టీగా నెలకొల్పినప్పుడు పేరు, గుర్తు, జెండా ఎంపిక కోసం ఒక కమిటీ ఏర్పాటైంది. మేము టెలిఫోన్, రైలు, ఉదయిస్తున్న సూర్యుడు వంటి కొన్ని గుర్తుల నుంచి ఒకటి ఎంపిక చేసుకోవలసి వచ్చింది. మేము కమలాన్ని ఎంచుకున్నాం. ఇది లౌకిక చిహ్నం. భక్తికి, అంకిత భావానికి, ఆధ్యాత్మికతకు, అందానికి అది ప్రతీక' అని మల్హోత్రా పార్టీ గుర్తు ఎంపిక గురించి తన గ్రంధంలో వివరించారు. కమలం పక్కా చిహ్నమని, ఇది 'మాకు పంకిల రాజకీయాల మధ్య వినమ్రత, పరిశుద్ధత గురించి గుర్తు చేస్తుంటుంది' అని ఆయన పేర్కొన్నారు.
బ్యాలెట్ పత్రంలో అభ్యర్థి పేరు పక్కనే గుర్తులు ఉండే సంప్రదాయం తక్కువ అక్షరాస్యత కారణంగా దేశంలో మొట్టమొదటి ఎన్నికల నుంచే మొదలైంది. దేశంలోని వోటర్లలో అత్యధిక సంఖ్యాకులు అభ్యర్థి పేరును చదవలేకపోవడమే ఇందుకు కారణం. అయితే, ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయమేమంటే దేశంలో మొదటిసారిగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రతి అభ్యర్థికి ప్రత్యేకంగా ఒక బ్యాలట్ పెట్టె ఉండడం.
Pages: -1- 2 -3- -4- News Posted: 18 March, 2009
|