కేరళలో పుట్టిన 'హస్తం'?
'అభ్యంతరకరం' కానంత కాలం ఏ పార్టీకైనా ఏ రకం గుర్తు ఉండాలో సూచించే కోడ్ ఏదీ లేదు. పార్టీ గుర్తు కోసం సమర్పించే దరఖాస్తును పరిశీలించి ఆమోదించే లేదా తిరస్కరించే బాధ్యత ఎన్నికల కమిషన్ దే. గుర్తింపు లేని పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం ఎన్నికల కమిషన్ (ఇసి) వద్ద ఫ్రీ గుర్తులు ఉంటాయి. గుర్తింపులేని పార్టీలు లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎంచుకోవడం కోసం ఇసి ఫ్రీ గుర్తుల జాబితాను కూడా నిర్వహిస్తుంటుంది. పార్టీల సంఖ్య పెరుగుతుండటంతో క్రమేపీ ఫ్రీ గుర్తుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. ఒకప్పుడు దాదాపు 100 వరకు ఉన్న ఫ్రీ గుర్తుల సంఖ్య ఇప్పుడు 60కి తగ్గిపోయింది. వేర్వేరు నియోజకవర్గాలలో వేర్వేరు స్వతంత్ర అభ్యర్థులు, గుర్తింపులేని పార్టీలు ఒకే గుర్తును ఉపయోగించుకోవచ్చు.
1990 దశకంలో ఒక ఉప ఎన్నికలో తమిళనాడులోని ఒక నియోజకవర్గంలో వెయ్యి మంది అభ్యర్థులు పోటీ చేశారు. అప్పుడు మేము గుర్తుల కోసం వెతకవలసి వచ్చింది. చివరకు ఒక సీసా, రెండు సీసాలు, మూడు సీసాలు వంటి గుర్తులను కూడా అభ్యర్థులకు కేటాయించాం. ఆ ఎన్నికలో బ్యాలట్ ను పుస్తకం రూపంలో ముద్రించవలసి వచ్చింది' అని ఎన్నికల కమిషన్ లో సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. ఫ్రీ గుర్తులలో కొన్ని పాతకాలపు రేడియో వంటివి పాత ఫ్యాషన్ అయ్యాయి. కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ వంటి కొత్త గుర్తులను ఇసి ఇంకా ఎంపిక చేయవలసి ఉంది.
ఒకప్పుడు ఫ్రీ గుర్తుల జాబితాలో జంతువులు కూడా ఉండేవి. అయితే, ప్రచారం కోసం జనం ఆ జంతువులను ఉపయోగించడం, వాటిని హింసించడం ప్రారంభించారు. అంటే, పావురం గుర్తుగా ఉన్న అభ్యర్థులు తమ వెంట పావురాలను తీసుకువెళుతుండేవారు. ఈ క్రమంలో జంతు హింస పెరుగుతున్నందున జంతు హక్కుల కార్యకర్తల నుంచి ఆక్షేపణలు వెల్లవెత్తాయి. ఫలితంగా సింహం, ఏనుగు మినహా ఏ జంతువు గుర్తునూ ఉపయోగించడం లేదు. రిజర్వ్ డ్ గుర్తులలో ఇప్పటికీ సింహం, ఏనుగు ఉన్నాయి. ప్రస్తుతం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి ఎన్నికల గుర్తు నిలబడిన సింహం కాగా బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి)కి నీలి ఏనుగు గుర్తు.
Pages: -1- -2- 3 -4- News Posted: 18 March, 2009
|