కేరళలో పుట్టిన 'హస్తం'?
'ఏనుగు నెమ్మదిగా నడుస్తుంది కాని తనకు అడ్డువచ్చిన దేనినైనా నాశనం చేయగల శక్తిని కలిగి ఉంటుంది కనుక బిఎస్ పి వ్యవస్థాపకుడు కాన్షీరామ్ నీలి ఏనుగును పార్టీ చిహ్నంగా ఎంపిక చేసుకున్నారు. ఇండియాలో సమానత్వం లేని సమాజంలో అగ్ర వర్ణాల ఆధిపత్యాన్ని ఆయన పార్టీ సవాల్ చేస్తూ, ఒకేవిధమైన వ్యవస్థను తీసుకురావాలని కోరుకుంటున్నది. ఆకాశం నీలంగా, విశ్వవ్యాప్తంగా ఉంటుంది కనుక నీలం రంగును ఎంచుకున్నారు' అని జెఎన్ యులో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ సుధా పాయి తెలియజేశారు.
ఫార్వర్డ్ బ్లాక్ ఎంపి బరుణ్ ముఖర్జీ తమ పార్టీ గుర్తు గురించి వివరిస్తూ, '1950 దశకంలో మా పార్టీ ఎన్నికల కమిషన్ వద్ద గల గుర్తుల నుంచి ఒకటి ఎంచుకోవలసి వచ్చింది. మేము నిలబడిన సింహాన్ని ఎంపిక చేశాం. సింహం జంతువులకు రాజే కాకుండా బలానికి కూడా ప్రతీక కదా. మా సింహం శ్రామిక వర్గం బలానికి ప్రతీక' అని చెప్పారు. 'దూకుతున్న పులి గుర్తును మా జెండాపై ఉంచాలని మేము కోరుకున్నాం. బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై సాగించిన పోరాటానికి ప్రతీకగా మా వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర బోస్ దానిని ఎంపిక చేశారు. కాని అప్పుడు ఎన్నికల కమిషన్ మా దరఖాస్తును తిరస్కరించింది' అని ఆయన తెలిపారు.
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్ జెడి) నాయకుడు రామ్ దేవ్ భండారి తమ పార్టీ గుర్తు గురించి మాట్లాడుతూ, ' మా పార్టీ గుర్తుగా హరికేన్ దీపాన్నిఎంచుకున్నాం. ఎందుకంటే అది చీకటిని పారద్రోలడమే కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో అంతటా సులభంగా గుర్తించదగినది. మాకు ప్రాంతీయ స్థాయిలో గుర్తు ఉన్నది. మేము దానిని జాతీయ స్థాయిలో కూడా గుర్తుగా ఉపయోగించబోతున్నాం' అని చెప్పారు.
Pages: -1- -2- -3- 4 News Posted: 18 March, 2009
|