బోర్డు తిప్పిన మొబైల్ వరల్డ్
దీని కోసం రాష్ట్రమంతటా ఔట్ లెట్లు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి 8.8.2008 ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడమే కాక, వెబ్ సైట్ ద్వారా కూడా దరఖాస్తులు ఆహ్వానించింది. ఆకర్షణీయమైన ఆదాయం. అంచెలంచెల బహుమతులు. దాంతో పదుల సంఖ్యలో ఔత్సాహికులు ఫ్రాంజైజీల కోసం దరకాస్తు చేసుకున్నారు. వారిలో ఒక్కొక్కరి నుంచి 5 లక్షల రూపాయలు డిపాజిట్ రూపంలో సేకరించి వారికి ఔట్ లెట్లు కేటాయించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 32 ఔట్ లెట్లు ప్రారంభించినట్లు సమాచారం.
అంతవరకు బాగానే నడిచింది. కానీ ఆదాయం తక్కువ ఆర్భాటం ఎక్కువ - పెట్టుబడి అంతా అద్దెలు, సిబ్బంది జీతాలు, విమాన ప్రయాణఆల ఖర్చులు వంటి వాటికే సరిపోవడంతో ఆరు నెలలు గడిచే సరికి ఫ్రాంఛైజీలకు చెల్లించవలసిన కమీషన్లు చెల్లించ లేక పోవడంతో సంస్థ బండారం కాస్తా బయటపడింది. తమ కమీషన్ కోసం రెండు మూడు నెలలు వైఎమ్ సి ప్రధాన కార్యాలయం చుట్టూ తిరిగిన ఫ్రాంచైజీలకు కమీషన్ అటుంచి తమ డిపాజిట్లకే ముప్పు వాటిల్లిందన్న నిజం బైటపడడంతో వారు చివరికి మంగళవారం రోజు హైదరాబాద్ లోని పంజా గుట్ట పోలీసులను ఆశ్రయించారు.
ఫ్రాంచైజీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమకు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం వైఎమ్ సి మొబైల్ వరల్డ్ నిర్వాహకుడు వెంకటసుబ్బయ్య దాదాపు 5 కోట్ల రూపాయల మేర ఫ్రాంఛైజిల నుంచి దండుకున్నట్లు తెలుస్తోందని పంజగుట్ట ఎస్ ఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఫ్రాంచైజీల కోసం ఒక్కొక్కరి నుంచి 5-7 లక్షల రూపాయలు, రూరల్ ప్రాంతాల నుండి ఫ్రాంచైజీల కోసం 4-5 లక్షల రూపాయల డిపాజిట్లుగా వసూలు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అంతేగాక 'గోల్డ్ కార్డుల' పేరిట ఒక్కో కార్డుకు 500 రూపాయల వంతున వినియోగదారుల నుంచి దాదాపు 50 లక్షల రూపాయలు వసూలు చేసి ఉంటారని సమాచారం. అంతేగాక వైఎమ్ సి నిర్వాహకుడైన వెంకట సుబ్బయ్య తమ సంస్థకు చెందిన స్టాక్ రికార్డులు కూడా సరిగా నిర్వహించలేదని, ఆడిటర్లకు కూడా ఫీజులు బకాయిపడినట్లు తెలుస్తోంది.
Pages: -1- 2 -3- News Posted: 18 March, 2009
|