19 ఎముకలు చిట్లిన హేన్స్
ఇటీవల కాలంలో ఇంతటి ఘోరమైన 'స్టంట్' ప్రమాదం మరొకటి ఉండకపోవచ్చు. అత్యంత ప్రమాదకరమైన (క్లిష్టమైన) ఫైట్స్ కంపోజ్ చేయడంలో సిద్ధహస్తుడైన పీటర్ హెయిన్స్ ఇటీవల ఓ యాక్షన్ సీన్ కంపోజ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డారు. శరీరంలోని 19 ఎముకలు విరిగిపోయాయి. ముఖంపైన 11, కుడి మోకాలుపై 2, ఎడమ చేతికి 3, కుడి ఛాతీపై రెండు ఎముకలు ఫెటీల్ మని విరిగిపోయాయి.
ఇండియాలో పుట్టినప్పటికీ విదేశాల్లో పెరిగి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ గా పాపులరైన పీటర్ హెయిన్స్ ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా పాపులర్ అయ్యారు. ఇటీవల 'గజనీ' చిత్రానికి ఆయన బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ గా అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం మణిరత్న, శంకర్ తాజా చిత్రాలకూ ఆయన స్టంట్ డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నారు. ప్రమాదం తెచ్చిన షాక్ నుంచి పీటర్ హెయిన్స్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. గాయపడిన కొద్ది గంటల తర్వాత పీటర్ ను కలిసినప్పుడు, ఈ ప్రమాదం కారణంగా తాను ఇప్పటికే ఒప్పుకున్న భారీ వెంచర్స్ 'రావణ' (మణిరత్నం దర్శకుడు), 'యంతిరిన్' (రజనీ-శంకర్ చిత్రం) షెడ్యూల్స్ లో జాప్యం కానున్నాయని ఆవేదనను వ్యక్తం చేశారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ లో వైద్యచికిత్స తీసుకుని డిశ్చార్చ్ అయిన అనంతరం ఆయన తొలిసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి సంఘటన పూర్వాపరాలను వివరించారు.
Pages: 1 -2- News Posted: 18 March, 2009
|