19 ఎముకలు చిట్లిన హేన్స్
ఫిబ్రవరి 18న రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక స్టంట్ సన్నివేశం రిహార్సల్స్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందన్నారు. చిరంజీవ తనయుడు రామ్ చరణ్ హీరోగా అల్లు అరవింద్ నిర్మిస్తున్న 'మగధీర' చిత్రం షూటింగ్ కోసం ఓ స్టంట్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశామనీ, భూమికి 45 అడుగుల ఎత్తున ఉన్న ఓ ట్రక్ లో తాను ఉన్నప్పుడు ప్రమాదవశాత్తూ ట్రక్ కు కట్టిన తాడు తెగిపోయిందన్నారు. తాను నేరుగా నేలను గుద్దుకున్నాననీ, తలను కాచుకునే ప్రయత్నంలో ముఖం సూటిగా నేలను తాకిందనీ చెప్పారు. తనకు తగిలిన గాయాల వల్ల రావణ, యంతిరిన్ చిత్రాల షెడ్యూల్స్ ఇబ్బందుల్లో పడ్డాయనీ, అయితే ఎప్పుడూ సినిమాల జాప్యాన్ని కోరుకోని తనకు ఈ పరిస్థితి ఇబ్బందికరంగా అనిపిస్తోందనీ అన్నారు. ముందు ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే పని సంగతి చూడవచ్చంటూ మణిరత్నం, శంకర్ తనకు ఊరట కలిగించారని చెప్పారు.
పీటర్ హెయిన్స్ ప్రస్తుతం వీల్ చెయిర్ లో కూర్చుని అసిస్టెంట్ల సహాయంతో మళ్లీ 'మగధీర' షూటింగ్ లో పాల్గొంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ఇక్కడ పని పూర్తి చేసుకుని మరో ఆపరేషన్ కోసం కొద్దిపాటి బ్రేక్ తీసుకుంటాననీ, ఆ తర్వాతే 'రావణ్', 'యంతిరిన్'చిత్రాలకు పనిచేస్తాననీ ఆయన వివరించారు. అయితే ఇందుకు ఎంత సమయం పడుతుందనేది తనకే తెలియదన్నారు. గాయాల బారి నుంచి తొందరగా కోలుకోవాలని ఆశించిన తొలివ్యక్తి ఎవరని అడిగినప్పుడు 'అక్షయ్ కుమార్ ' అంటూ పీటర్ హెయిన్స్ చిరునవ్వు నవ్వారు.
Pages: -1- 2 News Posted: 18 March, 2009
|