త్వరలో ఎల్ఐసి క్రెడిట్ కార్డ్
2009 జనవరి నాటికి క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఖర్చులు దేశంలో 7.85 శాతం అంటే 5,171.06 కోట్ల రూపాయలకు తగ్గిపోయినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. 2008 ఏప్రిల్ క్రెడిట్ కార్డుల ద్వారా 5,611.38 కోట్ల రూపాయలుగా ఉండేది. అయినప్పటికీ, ఏడాదికేడాదికి క్రెడిట్ కార్డుల ద్వారా ఖర్చు చేయడం 28 శాతం పెరిగింది. క్రెడిట్ కార్డుల బకాయిలు గత ఏడాది కాలంలో 70 శాతానికి చేరింది. 2008 డిసెంబర్ లో చెల్లించవలసిన మొత్తం బకాయిలు 29,359 కోట్ల రూపాయలు కాగా, 2007 డిసెంబర్ లో చెల్లించదవలసిన బకాయులు 17,306 కోట్ల రూపాయలకు పేరిగింది.
క్రెడిట్ కార్డు వినియోగదారులు 8.62 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జనవరి నాటికి 2.587 కోట్ల మందికి తగ్గిపోయింది. ఈ ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలో క్రెడిట్ కార్డులు 2.831 కోట్లకు చేరుకున్నాయి. 2007-08 ఏప్రిల్ జనవరి నెలల మధ్యకాలంలో క్రెడిట్ కార్డుల సంఖ్య 13.32 శాతానికి పెరిగింది. క్రెడిట్ కార్డు వ్యవస్థతో ఎల్ఐసికి రెండు లాభాలు చేకూరనున్నాయి. ఎల్ఐసి ప్రీమియం చెల్లించేందుకు క్రెడిట్ కార్డుల వ్యవస్థ అత్యంత శక్తివంతమైన సాధనంగా ఉపకరిస్తుంది. క్రెడిట్ కార్డుల ద్వారా తన వినియోగదారులకు సంపూర్ణమైన సేవలందించేందుకు అవకాశముంటుదని ఎల్ఐసి భావిస్తోంది.
Pages: -1- 2 News Posted: 19 March, 2009
|