రాహుల్ 'సోలో యాత్ర'కు జై!
న్యూఢిల్లీ: సంకీర్ణాలు కుదుర్చుకోవడంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 'దూరదృష్టిని, రాజకీయ అవగాహనను, ప్రావీణ్యాన్ని' కాంగ్రెస్ వేన్నోళ్ళ పొగిడిన ఐదు సంవత్సరాల అనంతరం 'ఒంటరి ప్రయాణం' చేయాలన్న పార్టీ యువ నేత రాహుల్ ప్రతిపాదనను పార్టీ శిరసావహిస్తున్నది. బీహార్ లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్ జెడి) స్టంప్ ఔట్ చేయడం, ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ (ఎస్ పి)తో చర్చలు విఫలం కావడం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సిపి) అధినేత శరద్ పవార్ ప్రధాని కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేయడం పర్యవసానంగా కాంగ్రెస్ లో ఒంటరి పోరే మంచిదనే భావనకు బలం చేకూరుతున్నది.
బీహార్ లో అన్ని సీట్లకు అభ్యర్థులను నిలబెట్టగలమని కాంగ్రెస్ బెదరించిన తరువాత ఆర్ జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, లోక్ జనశక్తి పార్టీ (ఎల్ జెపి) అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ ఏమి చేయడమా అని గురువారం తర్జనభర్జనలు పడనారంభించారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవారం సమావేశం కావచ్చు. రాజీ మార్గాన్ని వెంటనే కనుగొనకపోతే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయవచ్చుని లాలూ యాదవ్, పాశ్వాన్ భయపడుతున్నట్లు వారిద్దరి సన్నిహిత వర్గాలు తెలియజేశాయి.
2007 మార్చిలో ఒక ధాబాలో జర్నలిస్టులతో రాహుల్ సాగించిన ఇష్టాగోష్ఠిని అవకాశంగా తీసుకుని కాంగ్రెస్ నాయకులు కొందరు అసలు సంకీర్ణాలు ఎందుకు మంచివి కావో ఎన్నికలకు కొన్ని వారాల ముందు వాదించనారంభించారు. 2007 శాసనసభ ఎన్నికలకు ముందు ఉత్తర ప్రదేశ్ లో తన తొలి యాత్ర సమయంలో ఒక ధాబా వద్ద రాహుల్ మాట్లాడుతూ, 1996లో బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి)తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని 'పూర్తిగా అమ్ముడుపోవడం'గా అభివర్ణించారు. ఆ ప్రధాన రాష్ట్రంలో కాంగ్రెస్ పతనానికి అదే నాంది అయిందని ఆయన పేర్కొన్నారు.
Pages: 1 -2- -3- News Posted: 20 March, 2009
|