రాహుల్ 'సోలో యాత్ర'కు జై!
అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు, అప్పటి మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇప్పుడు యుపి వ్యవహారాల ఇన్ చార్జి అయిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆ పొత్తును కుదిర్చారు. నెహ్రూ, గాంధి కుటుంబ సభ్యులు ఎవరైనా సారథిగా ఉండి ఉంటే ఆ పొత్తు కుదిరి ఉండేదే కాదని రాహుల్ అన్నారు. 'రాహుల్ సరైన మాటే అన్నారు. ఈ దఫా ఉత్తర ప్రదేశ్ లో ఆయన మాటే నెగ్గినందుకు మాకు సంతోషంగా ఉంది. ఇతర రాష్ట్రాలలో కూడా అదే విధంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం' అని మహారాష్ట్ర నాయకుడు ఒకరు చెప్పారు.
సమాజ్ వాదితో పొత్తుకు అవకాశాలను దిగ్విజయ్ సింగ్, ఉత్తర ప్రదేశ్ నాయకులు కొందరు 'దెబ్బ తీస్తున్నార'ని తాము తొలుత అభిప్రాయపడ్డామని, అయితే, ఆ అభిప్రాయం 'తప్పని' ఇప్పుడు విదితమవుతున్నదని కాంగ్రెస్ నాయకులు కొందరు పేర్కొన్నారు. 'రాహుల్ అందుకు సుముఖంగా లేరని మేము భావించేందుకు కారణాలు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లో పార్టీకి తమిళనాడు గతి పట్టకూడదనేది ఆయన అభిప్రాయం. మా పార్టీని పునరుజ్జీవింపచేయాలంటే, ఒకటి రెండు ఎన్నికలలో ఫలితాలు సంతృప్తికరంగా లేకపోయినప్పటికీ మేము ఒంటరిగానే పోటీ చేయవలసి ఉంటుంది' అని పార్టీ కార్యనిర్వాహక వర్గ సభ్యుడు ఒకరు పేర్కొన్నారు.
Pages: -1- 2 -3- News Posted: 20 March, 2009
|