తగ్గిన క్రెడిట్ కార్డుల జోరు
క్రెడిట్ కార్డు హోల్డర్లు రివాల్వింగ్ సదుపాయాన్ని వినియోగించుకుంటూ, ఖర్చు చేసిన బిల్లులో 5 శాతం చెల్లిస్తున్నవారిపై కూడా బ్యాంకులు నిఘా వేస్తున్నాయి. రివాల్వింగ్ సదుపాయాన్ని వినియోగించుకునే వారి చెల్లింపు సామర్ధ్యాన్ని కూడా బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. చెల్లింపు సామర్ధ్యం లేని వారి రుణ పరిమితిని బ్యాంకులు తగ్గించి వేస్తున్నాయని ప్రైవేటు బ్యాంకులు చెబుతున్నాయి. పలు బ్యాంకులు తమ వద్ద డిపాజిట్లు చేయని వారి క్రెడిట్ కార్డులను రద్దు చేస్తున్నాయి. ఇవన్నీ ముందు జాగ్రత్త చర్యలుగా క్రెడిట్ కార్డులను పెద్ద ఎత్తున అందించే సంస్థలు హెచ్ ఎస్ బిసి, బిఓబి లు ప్రకటించాయి. గత ఏడాది ఏప్రిల్ లో 2.83 కోట్ల క్రెడిట్ కార్డులు జనవరి చివరినాటికి 2.58 కోట్లకు తగ్గిపోయాయని ఆర్ బిఐ అంచనాలు తెలిపాయి.
రుణ పరిమితులను పరిస్థితులను బట్టి మార్చడం జరుగుతుందని హెచ్ ఎస్ బిసి ఇండియా వైస్ ప్రెసిడెంట్ రవి సుబ్రమణ్యం తెలిపారు. ఆర్దిక వికాస కాలంలో రుణ పరిమితులను పెంచడం, క్రెడిట్ కార్డులను పెంచడం జరుగుతుందని, అదే ఆర్దిక సంక్షోభ కాలంలో అందుకు ప్రతిగా జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ మార్పులు ఆయా వినియోగదారుని వ్యక్తిగత రికార్డు పై ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. రెండేళ్లుగా తన రుణ పరిమితిలో 40 శాతం కూడా వినియోగించుకోని ఒక వినియోగదారుడు అకస్మాత్తుగా అతి తక్కువ కాలంలో తన రుణ పరిమితికి చేరువగా ఖర్చు పెట్టిన సందర్భంలో బ్యాంక్లు వారి రుణ పరిమితులపై కోత విధిస్తాయి.
ప్రభుత్వరంగ బ్యాంకుల క్రెడిట్ కార్డు వ్యవస్థలో కూడా కొంత ఆందోళన నెలకొందని బిఓబి కార్డుల వైస్ ప్రెసిడెంట్ ఎమ్ కె దుగ్గాల్ తెలిపారు. బ్యాంక్ ఆప్ బరోడా క్రెడిట్ కార్డుల హౌల్డర్లలో కూడా బకాయిలు చెల్లించని వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు ఆయన తెలిపారు. బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసినవారికి మాత్రమే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇలాంటి వారు డిపాజిట్ చేసిన డబ్బులో 85 శాతాన్ని మాత్రమే రుణ పరిమితిగా ఐసిఐసిఐ నిర్ణయించింది. ఒక వేళ అలాంటి డిపాజిటర్లు డిఫాల్టర్లు అయిన సందర్భంలో వారి డిపాజిట్ సొమ్మును బ్యాంక్ చెల్లింపులకు వినియోగిస్తుంది. ఇలాంటి విధానం బ్యాంకులకు ఊరట కలిగిస్తుంది.
Pages: -1- 2 News Posted: 20 March, 2009
|