ఐటి కంపెనీల్లో 'జాగోరే'!
బెంగళూరు: రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఉద్యోగులైన వోటర్లు, ముఖ్యంగా యువజనులు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తే వోటర్లలో నిర్లిప్తతను పారదోలి, చైతన్యవంతులను చేసేందుకు ఆసక్తి గల కొన్ని బృందాలు చేస్తున్న కృషిని శ్లాఘించవలసి ఉంటుంది. బెంగళూరుకు చెందిన ఒక ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ (ఎన్ జిఒ) జనాగ్రహ, టాటా టీ సంస్థ 'జాగో రె' ప్రచారోద్యమాన్ని 2008 సెప్టెంబర్ లో బుల్లితెరపై చేపట్టినప్పుడు దానిని పరోక్ష ప్రకటనగా కొందరు పేర్కొన్నప్పటికీ , అటువంటి ప్రయత్నం సఫలం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వోట్లు వేసేట్లుగా తమ ఉద్యోగులను ఇతర పద్ధతులలో చైతన్యపరిచేందుకు ప్రైవేట్ రంగ సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
'జాగో రె' ప్రచారోద్యమంలో పాల్గొనేందుకు కేవలం 50 కార్పొరేట్ సంస్థలే ముందుకు వచ్చినప్పటికీ దాదాపు నాలుగు లక్షల మంది వోటర్ రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే, 2009 ఎన్నికలలో వోట్లు వేసేందుకు 71.4 కోట్ల మంది వోటర్లు పేర్లు నమోదు చేసుకొన్న స్థితిలో ఇది ఇంకా సముద్రంలో నీటిబొట్టు వంటిదే. అయినప్పటికీ, ఈ ప్రచారోద్యమం కార్పొరేట్లు, ఇతర వర్గాలలోఆసక్తిని రేపింది. అవి మొట్టమొదటిసారిగా కార్యోన్ముఖం అయ్యాయి.
'మేము ఏదైనా చేసి మార్పు తీసుకురావాలని అనుకుంటున్నాం' అని బెంగళూరులో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ ఎండి అమర్ కృష్ణమూర్తి చెప్పారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను సిద్ధం చేసేందుకు, ఎన్నికల సంబంధిత సమాచారం అందజేసేందుకు జనాగ్రహతో సహా ఐదు ఇతర ఎన్ జిఒలను ఆయన సంఘటితం చేసి 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.స్మార్ట్ వోట్ డాట్ ఇన్' అనే వెబ్ సైట్ ను ఏర్పాటు చేశారు.
Pages: 1 -2- -3- News Posted: 23 March, 2009
|