ఐటి కంపెనీల్లో 'జాగోరే'!
ఈ ప్రచారోద్యమానికి స్ఫూర్తి పొందిన మరొక సంస్థ ఐసిఐసిఐ ప్రుడెన్షల్ లైఫ్ బీమా కంపెనీ. ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భార్గవ్ దాస్ గుప్తా మాట్లాడుతూ, 'తమ వోటు హక్కు వినియోగించుకునేట్లుగా మా ఉద్యోగులను ప్రోత్సహించడంతో మన దేశం పట్ల మా బాధ్యత మొదలవుతుందని మా భావన. ఈ సిద్ధాంతానికి తగినట్లుగా మేము జాగో రె ప్రచారోద్యమానికి మద్దతు అందజేస్తున్నాం' అని చెప్పారు.
ఇక కన్సల్టింగ్ సంస్థ ఏక్సెంచూర్ (ఇండియా) తన కార్పొరేట్ పౌరసత్వ అజెండాలో భాగంగా సంస్థ లోపల ఒక ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తూ, వోటింగ్ కోసం ఉద్యోగులు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి వీలుగా తన కాంపస్ లలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి జనాగ్రహ ప్రతినిధుల సేవలను ఉపయోగించుకుంటున్నది. ఇంకా అనేక సంస్థలు కూడా ఈ విధానాన్ని అనుసరించడానికి సిద్ధపడుతున్నాయి. 'ఈ విషయమై మా సంస్థలో ఇంకా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. కాని వోట్లు వేసేట్లుగా మా ఉద్యోగులను కోరేందుకు ఒక బృందాన్ని నియమించబోతున్నాం' అని హిందుస్థాన్ కన్ స్ట్రక్చర్ కంపెనీ సిఎఫ్ఒ ప్రవీణ సూద్ తెలిపారు.
'జాగో రె' ప్రచారోద్యమ సంస్థలో కమ్యూనికేషన్లు, మార్కెటింగ్ విభాగం అధిపతి శరత్ పోతరాజు మాట్లాడుతూ, ఇది నాంది మాత్రమేనని, రానున్న ఐదు సంవత్సరాలలో ఈ ప్రచారోద్యమం ద్వారా 100 కోట్ల మంది వోటర్ల పేర్లు నమోదు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. అయితే, 2008 సెప్టెంబర్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి 50 సంస్థలు ఇందులో చేరినందున మరిన్న సంస్థలు కూడా ఇందులో భాగస్వాములు కావచ్చునని ఆశిస్తున్నారు.
Pages: -1- -2- 3 News Posted: 23 March, 2009
|