ఐటి కంపెనీల్లో 'జాగోరే'!
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి వోట్లు వేయని బెంగళూరు పౌరులుగా ఆమధ్య అభివర్ణించిన ఐటి సమాజం సభ్యులు ఈ ఉద్యమంలో పాల్గొంటుండడం కావడం గమనార్హం. యాహూ, ఓరాకిల్, ఇన్ఫోసిస్, విప్రో, గూగుల్, ఏక్సెంచూర్ (ఇండియా), సిస్కో, టాటా వంటి సంస్థలు ఇప్పుడు ముందుకు వచ్చి వోటు వేసేందుకు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వెళ్ళవలసిందిగా తమ ఉద్యోగులను కోరాయి.
ఉదాహరణకు, ఇన్ఫోసిస్ సంస్థలో కొన్ని నెలలుగా వోటర్ చైతన్య కార్యక్రమం అమలు జరుగుతోంది. కొంత మంది ఉద్యోగులు తమంతట తాముగా 'జాగో రె' రాయబారులుగా అవతారం దాల్చి కాంపస్ లో ఈ ప్రచారోద్యమాన్ని విస్తరించసాగారు. 'సత్పరిపాలన కోసం ఎన్నికలలో పాల్గొనేట్లుగా ఉద్యోగులను ఇన్ఫోసిస్ లో ఎప్పుడూ ప్రేరేపిస్తున్నాం' అని సంస్థ సిఎఫ్ఒ వి. బాలకృష్ణన్ తెలిపారు.
సిస్కో డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ సీతారామన్ మాట్లాడుతూ, 'ఐటి పరిశ్రమకు రెండు అవరోధాలు ఉన్నాయి. మొదటిది - ఎప్పుడూ సంచారంలో ఉండే ఉద్యోగులు తమ సొంత ఊరిలో లేదా అసలు ఎక్కడా వోటర్లుగా పేర్లు నమోదు చేసుకోకపోవడం జరుగుతోంది. రెండవది - వోటు వేసేందుకు వారికి ప్రేరణ ఉండడం లేదు. అందువల్ల వోటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలనే ఇచ్ఛ లేకపోతోంది. ఈ సమస్యలను అధిగమించవలసిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నాం' అని చెప్పారు.
Pages: -1- 2 -3- News Posted: 23 March, 2009
|