'అహం' అంటున్న పార్టీలు!
హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ముక్కోణపు పోటీ జరుగుతోంది. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితికి కొంత వరకూ ఇదే కారణమని చెప్పవచ్చు. ఈ సారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కొన్ని సర్వేలు వెల్లడించగా,ఆ సర్వేలను నమ్మడానికి లేదని మహాకూటమి, ప్రజారాజ్యం నాయకులు అంటున్నారు. ఇందుకు తగ్గట్టుగానే రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం అనిశ్చితంగానే ఉన్నాయి. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతోనే త్రిముఖ పోటీ అనివార్యమయింది. అయితే దీనివల్ల ఎక్కువగా నష్టపోయేది మహాకూటమికి సారథ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీయేనని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఆ రెండు పార్టీలు చీలుస్తాయని, దానివల్ల కాగ్రెస్ పార్టీయే లాభపడుతుందనిఆయన వాదన. కాని కాంగ్రెస్ విజయం నల్లేరు మీద నడక కాకపోవచ్చు.
సిపిఐ, సిపిఎం, టిఆరెస్ లతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలపడింది. టిఆరెస్ తో ఆ పార్టీకి సీట్ల సర్దుబాటులో ఏర్పడిన ప్రతిష్టంభన తాత్కాలికమే. ఎందుకంటే తెగేదాకా లాగడానికి లాగడానికి రెండు పార్టీలు సిద్ధంగా లేవు. రెండు పార్టీలకు పొత్తు అవసరమే. రెండింటికీ ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీయే. కాని తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి రావలసిన అవసరం ఉంది. లేకపోతే ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆ పార్టీ గిలగిలలాడక తప్పదు.
Pages: 1 -2- -3- News Posted: 23 March, 2009
|