'అహం' అంటున్న పార్టీలు!
రాయలసీమ విషయానికి వస్తే, అక్కడ ఎప్పుడైనా కాంగ్రెస్ దే పైచేయి. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వల్ల పార్టీకి మరింత బలం చేకూరిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కాకపోతే, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో తెలుగుదేశం, కడప జిల్లాలో ప్రజారాజ్యం పార్టీల నుంచి ఈ సారి గట్టి పోటీ ఎదురు కావచ్చంటున్నారు. దీనికితోడు కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల కేటాయింపు తర్వాత అసమ్మతి సెగలు రేగుతున్నాయి. తాజాగా సీనియరం నాయకుడు పెన్మెత్స సాంబశివరాజు పార్టీకి రాజీనామా చేశారు. మరో నాయకుడు దారా సాంబయ్య కూడా ప్రజారాజ్యంలో చేనున్నట్టు తెలుస్తోంది. టిక్కెట్ల కేటాయింపు విషయంలో సామాజిక న్యాయాన్ని పాటించలేదన్న విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. బిసిలకు తగినన్ని స్థానాలు కేటాయించడానికి సోనియా గాంధీ సుఖంగానే వున్నా, రాష్ట్ర నాయకత్వమే విఫలమయిందని పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు విలేఖరులకు చెప్పారు.
ఏది ఏమైనా రాష్ట్రంలో పరిస్థితి అంచనాలకు అందడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే పోలింగు నాటికైనా అది సాధ్యమవుతుందా అనేదే అంతుపట్టడం లేదు.
Pages: -1- -2- 3 News Posted: 23 March, 2009
|