'అహం' అంటున్న పార్టీలు!
ఇక ప్రజారాజ్యం పార్టీని కూడా సర్వేలు తక్కువగానే అంచనా వేశాయి. పార్టీ అధినేత చిరంజీవి సభలకు జనం భారీగా తరలి వస్తున్నప్పటికీ, ఓట్లు మాత్రం పెద్దగా పడే అవకాశం లేదని సర్వేల సారాంశం. అయితే ఉత్తరాంధ్రలోను, ఉభయ గోదావరి జిల్లాల్లోను ఆ పార్టీ బలంగా ఉందట. మొన్న జరిగిన ప్రజా విజయభేరికి హాజరైన వారంతా తెలంగాణ వారేనని, అంతమంది ఓట్లూ తమవేనని, తెలంగాణలో తాము బలంగా ఉన్నామని చెప్పడానికి, ఆంధ్ర(రాజమండ్రి), రాయలసీమ(తిరుపతి) సభల్లాగే తెలంగాణ సభే నిదర్శనమని, ఫలితంగా ఎన్నికల్లో విజయం తమదేనని చిరంజీవి బల్లగుద్ది చెబుతున్నారు.
ఇకపోతే మహాకూటమి పరిస్థితి ఇంకా అనిశ్చితంగానే ఉంది. తెలంగాణలో బలపడినట్టు కనిపిస్తున్నప్పటికీ, నాలుగు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో జరిగిన గొడవలు, సర్దుబాట్ల వల్ల స్థానిక నాయకులకు జరిగిన భంగపాట్లు కూటమి ఫలితాలపా ే మేరకు ప్రభావం చూపుతాయో అప్పడే చెప్పలేం. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు చెందిన తెలుగుదేశం నాయకులు హెచ్చుమంది ప్రజారాజ్యంలో చేరారు. తమ్మినేని సీతారాం, కిమిడి కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావు, కోటగిరి విద్యాధరరావు వంటి పలుకుబడి గల నాయకులే తలుగుదేశం నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్లారు. దీని ప్రభావం గణనీయంగా ఉంటుందని, ఎక్కువగా తెలుగుదేశానికే నష్టం కలుగుతుందని అంచనా వేస్తున్నారు.
Pages: -1- 2 -3- News Posted: 23 March, 2009
|