చీకటిని ఛేదించిన 'నానో'
టాటా గ్రూపు చైర్మన్ రతన్ టాటా తన విదేశీ ప్రయాణాన్ని ముగించుకుని ముంబై చేరుకున్నారు. నానో విడుదల కార్యక్రమానికి చేసే ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. నానో విడుదల కార్యక్రమం మూడు దశలుగా నడుస్తుంది. మొదటి దశలో సీనియర్ ఎడిటర్లకు, టాటా మేనేజ్ మెంట్ కు ఫలహారం ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. రెండవ దశలో మీడియా సమావేశం జరుగుతుంది. మూడవ దశలో సాయంత్రం నానో విడుదల కార్యక్రమం జరుగుతుంది. టాటా మోటార్స్ ఉన్నతాధికారులతో రతన్ టాటా ఆదివారంనాడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చైర్మన్ రతన్ టాటా చాలా హుందాగా, మౌనంగా ఉన్నారు. నానో తొలిసారి విడుదల సమయంలో కంటే ఇప్పుడు పలు రకాల సవాళ్లను ఎదుర్కుంటున్నప్పటికీ రతన్ టాటా చాలా హుందాగా ఉన్నారని పలువురు టాటా మోటార్స్ అధికారులు తెలిపారు.
కారును లాటరీ తీయడం ద్వారా కొనుగోలుదారుని ఎంపిక చేస్తారు. అందువల్ల, తొలి బుకింగ్ లో అనిశ్చితి చోటు చేసుకుంది. కేటాయించిన రెండు నెలల్లో కొనుగోలు దారునికి చేరుతుంది. ప్రస్తుతం ఒక వ్యక్తి ఒక నానో కంటే ఎక్కవ కొనుగోలు చేసేందుకు వీలు లేదు. ఈ రోజు కేవలం 2వేల యూనిట్ల నానో కార్లు మాత్రమే సిద్దంగా ఉన్నాయి. ఏప్రిల్ లో ఒక వెయ్యి నుండి పదిహేను వందల కార్లను కంపెనీ తయారు చేయబోతోందని డీలర్లు చెబుతున్నారు. మే లో 2 వేల కార్లు, జూన్ లో 3 వేలు, జులైలో 4 వేల కార్లను కంపెనీ ఉత్పత్తి చేస్తుందని వారు చెబుతున్నారు. సెప్టెంబర్ మాసం నుండి నెలకు 7 వేల నానో కార్లను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Pages: -1- 2 News Posted: 23 March, 2009
|