జూనియర్ ప్రభంజనం!
హైదరాబాద్: గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చిత్తు చేసి కాంగ్రెస్‌కు పట్టం కట్టిన ఉత్తరాంధ్రలో పరిస్థితి క్రమేపీ మారుతున్నది. జనం వోటు బ్యాంకు మళ్ళీ తెలుగు దేశం పార్టీ వైపు తరలుతున్నది. అందుకు కారణం ఒకే ఒక్కడు...చంద్రబాబును ఎలాగైనా సరే అధికారపీఠం ఎక్కించాలని సినీ ప్రపంచం నుంచి జన బాహుళ్యంలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ అందుకు మూల కారణం. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జూనియర్ జరిపిన పర్యటన టిడిపికి పూర్తి అనుకూల వాతావరణాన్ని కలిగించే దిశగా సాగింది. ఈ నెల 12 నుంచి తొమ్మిది రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించిన జూనియర్ కాంగ్రెస్ కోటల్లో గట్టి పాగా వేశారు.
సాధారణంగా సినీ తారలు, పేరున్న రాజకీయ నాయ కులు పర్యటనలకు వచ్చి ఉపన్యసించినప్పుడు జనం ఎగబడి రావటం సాధారణం. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, బాలకృష్ణ పర్యటనలకు సైతం జనం బ్రహ్మాండంగా హాజరయ్యారు. అయితే జూని యర్ ఆకర్షించినంత ఎక్కువగా వారి ఉపన్యాసాలు జనాన్ని ఆకట్టుకోవటం కనిపించలేదు.చిరంజీవి, బాలయ్య మాట్లాడుతున్నంతసేపూ జనం హోరెత్తినట్టు కరతాళ ధ్వనులు, ఈలలు వేయటం, నినాదాలుచేయటం జరుగు తుంది. పవన్ కల్యాణ్ మాట్లాడితే జనం కాస్త నింపాదిగా వింటారు. వీరికి భిన్నంగా జూనియర్ ఉపన్యసిస్తున్నప్పుడు జనం చెవులప్పగించి ఆయన చెప్పిందంతా వింటున్నారు. తమలో తాము చర్చించుకుంటున్నారు. ఆయన తర్కాన్ని మెచ్చుకుంటున్నారు.
Pages: 1 -2- -3- News Posted: 24 March, 2009
|