జూనియర్ ప్రభంజనం!
చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌కు భిన్నంగా జూనియర్ ఉపన్యాసాలకు జనంలో క్రేజ్ పెరిగిందంటే ఆయన మాటల్లో ఉండే స్పష్టత ప్రధాన కారణం. శ్రీకాకులం జిల్లాలో ఇచ్ఛాపురం నుంచి పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, పాతపట్నం, రాజాం, ఎచ్చెర్ల, ఆమదాల వలసల్లో జూనియర్ పర్యటన మూడు రోజులు సాగింది. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉపన్యాసాల్లో కొత్త ఒరవడి సృష్టించారు. తనదైన శైలి చూపించారు. ఆయన అన్న ప్రతిమాటకూ జనం జేజేలు పలికారు. నీరాజనాలు పట్టారు. మాటలో, భాషలో, భావంలో, అర్థంలో విస్పష్టమైన శైలిని జూనియర్ ప్రతిచోటా ప్రదర్శిస్తున్నారు.
విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో జూనియర్ జరిపిన రోడ్‌షోలు బ్రహ్మాండమైన స్పందనకు సాక్ష్యంగా నిలిచాయి. విజయనగరంలో పార్వతీపురం, బొబ్బిలి, గజ పతినగరం, చీపురుపల్లి, విజయనగరం, ఎస్.కోటలో ఆయన సభలు గతంలో ఎన్టీరామారావు సభలను గుర్తు తెచ్చాయని అక్కడి వారు చెప్పుకుంటున్నారు. విశాఖ జిల్లా లో భీమిలి నుంచి నర్సీపట్నం, చోడవరం, అనకాపల్లి, ఎల మంచిలి, విశాఖల్లో జరిపిన రోడ్‌షోలకు జనం పోటెత్తింది.
గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 36 స్థానాల్లో కేవలం 10 స్థానాలను టిడిపి గెలుచుకోగలిగింది. ఇప్పుడు జూనియర్ పర్యటనలు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్తి అనుకూల వాతావరణాన్ని కల్పించటంలో సఫలమయ్యాయని అక్కడి పార్టీ నేతలు ఆనందిస్తున్నారు. జూనియర్ రోడ్‌షోలకు ఇసుక వేస్తే రాలనంత జనం హాజరు కావటం తమకు పూర్తిగా అనుకూల పరిణామం అంటున్నారు. జనం వైఖరి చూస్తే వోటు బ్యాంకు తెలుగుదేశం పార్టీ వైపు ఎక్కువగా బదలీ అయ్యే అవకాశాలు బాగున్నాయని తటస్థులు సైతం అంగీకరిస్తున్నారు.
Pages: -1- 2 -3- News Posted: 24 March, 2009
|