జూనియర్ ప్రభంజనం!
టిడిపి అధికారంలోకి వస్తే వైఎస్ సర్కార్ అవినీతి విచారణకు ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాల్సి వస్తుంది...అనీ, తనది కాకపోతే కాశీ దాకా డేకమన్నట్టు వైఎస్ సర్కార్ వ్యవహరిస్తున్నదని, ప్రాజెక్టుల బడ్జెట్ లక్ష కోట్ల నుంచి రెండు లక్షల కోట్లకు పెరిగినా ఒక్క ఎకరాకైనా నీరు వచ్చిందా అని, ఒక చిత్రం శత దినోత్సవ కార్యక్రమంలోచంద్రబాబు బాగా పని చేస్తున్నారు... ముఖ్యమంత్రి కాదు...ప్రధాని కావాలి అని పొగిడిన వారే ఇప్పుడు మార్పు కావాలన్న పేరిట పార్టీ పెట్టి ఆయనను విమర్సిస్తున్నారు...రెండు నాల్కల ధోరణి చూశారా సోదరులారా? అని చిరంజీవి పార్టీని పరోక్షంగా ఎద్దేవా చేసినప్పుడు...ఇలా ఎక్కడికి వెళ్ళినా అక్కడ కొత్త కొత్త అంశాలను, స్థానిక అంశాలతో కలగలుపుతూ సాగుతున్న జూనియర్ ప్రసంగాలు తెలుగుదేశం పార్టీకి విస్తృతమైన ప్రచారాన్ని కల్పిస్తున్నాయి.
ప్రజారాజ్యం పార్టీ నేత తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ, కొణతాల రామకృష్ణ లాంటి హేమాహేమీలున్న నియోజకవర్గాలలో సైతం జూనియర్ రోడ్‌షోలకు ఇసుక వేస్తే రాలనంతగా జనం హాజరై ఆయన ప్రసంగాలు శ్రద్ధగా విన్నారు. ఇదే వేడి ఎన్నికల దాకా కొనసాగితే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో తాము పాతిక స్థానాలకు తగ్గకుండా గెలుచుకుంటామని టీడీపీ నాయకులు ఢంకా బజాయించి చెబుతున్నారు.
Pages: -1- -2- 3 News Posted: 24 March, 2009
|