వైఎస్! ఇంత ద్రోహమా?
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో నిరసనల పర్వం ఉధృతమవుతున్నది. సొంత వైఫల్యాలను ఇతరుల మీదికి నెట్టి, తమను బలిపశువుల్ని చేశారని అనేక మంది కాంగ్రెస్ నాయకులు అక్కసుతో ఉన్నారు. గెలుపు అవకాశాలున్నా, తమ మీద ఏవేవో ముద్రలు వేసి టిక్కెట్లు ఇవ్వలేదని అనేక మంది ఢిల్లీ వెళ్లి అధిష్టానం ముందు ఆక్రోశం వెళ్లగక్కుతు న్నారు. సమీప భవిష్యత్తులో రాష్ట్ర పార్టీ యావత్తూ తన గుప్పిట్లో పెట్టుకోవాలన్న లక్ష్యంతోనే వైఎస్ సర్వేలను అడ్డు పెట్టుకుని, తమపై ప్రజావ్యతిరేక ముద్ర వేశారని కనిపిం చిన ప్రతి నాయకుడికీ మొర పెట్టుకుంటున్నారు.
ఐదేళ్ల వైఎస్ ప్రభుత్వంలో ఆయనపై వచ్చినన్ని ఆరోపణల్లో తమపై ఒక్క శాతం కూడా రాలేదని, అయినా ప్రజావ్యతిరేకత ముద్ర వేసి తమను బలిచేశారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, టీఆర్ ఎస్, వామపక్షాలు 95 శాతం వైఎస్, ఆయన కుటుంబ సభ్యులపైనే వ్యక్తిగత ఆరోపణలు చేశాయి తప్ప, తమపై కాదన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండే పెన్మత్స సాంబశివరాజు వంటి వారిపై సర్వేలో వ్యతిరేకత వచ్చి, ప్రతిపక్షాల నుంచి అనేక ఆరోపణలు ఎదుర్కొన్న బొత్స సత్యనారాయణ వంటి వారికి మాత్రం సానుకూలత ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదని విజ యనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత ఒకరు వ్యంగ్యం గా వ్యాఖ్యానించారు.
Pages: 1 -2- -3- News Posted: 24 March, 2009
|