వైఎస్! ఇంత ద్రోహమా?
వైఎస్, ఆయన ప్రభుత్వంపై గత ఐదేళ్లలో వచ్చిన అవినీతి ఆరోపణలే కాంగ్రెస్‌కు ప్రతికూలంగా పరిణమించాయి తప్ప తమపై ఉన్న వ్యతిరేకత కారణం కానేకాదని సీట్లు రాని నేతలు స్పష్టం చేస్తున్నారు. సర్వేలు తమను బలిపశు వునుచేసేందుకేనని ఆరోపిస్తున్నారు. వైఎస్ సొంత సర్వేలు చేయించి తమ భవిష్యత్తు నాశనం చేశారని మండిపడు తున్నారు. ఆయన కుమారుడు జగన్‌కు ఏం అనుభవం ఉందని ఆయన పేరు సర్వేలో వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. `అయినా ఏం అధికారాలున్నాయని మాపై ఆరోపణ లొస్తాయి? రొటీన్‌గా వచ్చే కమీషన్లు తప్ప బావు కున్నదేముంది' అని ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖు డొకరు ప్రశ్నించారు.
చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు లేదా పూతలపట్టు స్థానాలను ఆశించిన శాసన సభ డిప్యూటి స్పీకర్ కుతూహలమ్మ తనకు అన్యాయం జరిగిందని, ఆడబిడ్డ ఉసురు ఊరకే పోదని శాపనార్థాలు పెడుతూ ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు మొయిలీని కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, రెండవ దశ ఎన్నికలకు నామి నేషన్ గడువు ఏప్రిల్ 4వరకు ఉందని, గంగాధర నెల్లూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా ఒక నామినేషను, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరో నామినేషన్ వేస్తానని, నామినేషన్ ఉపసంహరణ గడువులోగా పార్టీ బి-పారం వస్తే పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటాను, లేకుంటే స్వతంత్ర అభ్యర్థిగా నిలుస్తాననని ఆమె చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలసి తన బాధ వెల్లడిస్తానని చెప్పారు. జిల్లా నాయకులైన మంత్రి ఆర్ చెంగా రెడ్డి, చీఫ్‌విప్ కిరణ్‌కుమార్ రెడ్డి వల్లనే తనకు టికెట్ దొరకలేదని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ టికెట్ విషయమై గతంలో తనకు మాట ఇచ్చారని, ఇపుడు కూడా తప్పరని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి మూలింటి మారెప్ప కూడా ఢిల్లీ చేరుకొని తనకు టికెట్ రాకపోడంంపై కేంద్ర నాయకత్వాన్ని కలువ డానికి సిద్దంగా ఉన్నారు. తాను ముఖ్యమంత్రి వైయస్‌నే తన యేసుగా భావించానని, కాని ఆయనే తనకు శిలువ వేస్తారని ఊహించ లేదని అన్నారు.
Pages: -1- -2- 3 News Posted: 24 March, 2009
|