వైఎస్! ఇంత ద్రోహమా?
వైఎస్ మద్దతుతో అనేక అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలకు లేని ప్రజావ్యతిరేకత, ఎలాంటి ఆరోపణలు ఎదుర్కోని తమపై ఎందుకు ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. `వైఎస్‌కు సన్నిహితుడైన పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే ఒకరిపై బాహాటంగానే ఆరోప ణలు వచ్చాయి. ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అయినా అతనికే టికెట్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జిగా ఉన్న మంత్రి జెసి ఇసుక వ్యవహారంలో రూ.7 కోట్ల మినహాయింపు జీఓ ఇచ్చిన వైనంపై మంత్రి గొల్లపల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. విచిత్రంగా జెసిని కొనసా గించి, గొల్లపల్లిపై వేటు వేశారు. మరి జెసికి ప్రజా వ్యతిరే కత ఉండదా' అని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నేత వ్యాఖ్యానించారు. వైఎస్‌కు సన్నిహితులు, మద్దతుదా రులైన పలువురు ఎమ్మెల్యేల అవినీతి ఆరోపణలపై అసెంబ్లీ లోనే చర్చ జరిగిందని, అలాంటి వారికి సైతం టికెట్లు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. .
నిజానికి వైఎస్, ఆయన మంత్రివర్గ సహచరుల్లో కొందరు, ఆయన మద్దతుదారులైన మరికొందరు ఎమ్మెల్యేలపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ప్రభుత్వం వారికి అనుకూ లంగా తీసుకున్న నిర్ణయాల వల్లే కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది తప్ప తమపై కాదని వారు నిర్మొహ మాటంగా చెబుతున్నారు. స్థానిక సంస్ధల ఎన్నికల్లో విజ యం సాధించినప్పటికీ తనకు టికెట్ ఇవ్వలేదని విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు వాపో యారు. గుంటూరు జిల్లాలో ఒక మంత్రి తన కుమారుడి చేతికి పెత్తనం ఇవ్వడంతో అక్కడ ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత పెరిగినప్పటికీ మళ్లీ మంత్రికే టికెట్ ఇచ్చా రంటున్నారు. వారిపై ఉన్న వ్యక్తిగత వ్యతిరేƒత పార్టీ ఖాతా లో కలిస్తే ఇక వాళ్లంతా ఎక్కడ గెలుస్తారని ప్రశ్నిస్తున్నారు.
Pages: -1- 2 -3- News Posted: 24 March, 2009
|